రాష్ట్రానికి ష్నైడ‌ర్, స్టాడ్లర్..భారీగా పెట్టుబడులు

రాష్ట్రానికి ష్నైడ‌ర్, స్టాడ్లర్..భారీగా పెట్టుబడులు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకువస్తున్నాయి. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. దీంతో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా ష్నైడ‌ర్ ఎల‌క్ట్రిక్ కంపెనీ, స్టాడ్లర్ రైల్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఓకే చెప్పాయి. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి.

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకు వచ్చింది. స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్ గార్డ్ బ్రోక్ మెయ్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశార. ఒప్పందం మేరకు రానున్న రెండేళ్లలో తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం 1000 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నది. ఈ కంపెనీ స్థాపన తర్వాత తయారు చేసే రైల్వే కోచ్ లను కేవలం భారత్ తోపాటు ఏషియా పసిఫిక్ రీజియన్ కు సైతం ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలపింది. కాగా రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన స్టాడ్లర్ కంపెనీకి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా రాష్ట్రంలో మరో యూనిట్ ఏర్పాటు చేసేందుకు ష్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీ ఓకే చెప్పింది. కంపెనీ విస్తరణపై మంత్రి కేటీఆర్ తో ష్నైడర్ కంపెనీ ప్రతినిధులు సమావేశమై చర్చించారు. ఇప్పటికే తెలంగాణలో నెలకొల్పిన తమ కంపెనీ కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో రెండో యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో ష్నైడర్ కంపెనీకి కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

బిగ్ హిట్ లేకుండానే పాన్ ఇండియా మూవీస్ కి యాక్షన్, కట్

యాసిన్​ మాలిక్కు యావజ్జీవ శిక్ష ఖరారు