యాసిన్​ మాలిక్కు యావజ్జీవ శిక్ష ఖరారు

యాసిన్​ మాలిక్కు యావజ్జీవ శిక్ష ఖరారు

ఉగ్రవాదులకు నిధుల కేసులో జమ్మూ కశ్మీర్​ వేర్పాటువాద నేత యాసిన్​మాలిక్కు (56) పటియాలా హౌస్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. రెండు యావజ్జీవ శిక్షలతో పాటు ఐదు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షలన్నీ ఒకేసారి అమలవుతాయని స్పష్టం చేసింది. దీంతో పాటు రూ.10లక్షల జరిమానా విధించింది. భారీ భద్రత నడుమ మాలిక్ ను బుధవారం మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు. ఎన్ఐఏ మరణ శిక్ష విధించాలని వాదించగా.. ధర్మాసనం మాత్రం యావజ్జీవ శిక్షకే మొగ్గుచూపింది. ఈ కేసుకు సంబంధించి పటియాలా హౌస్ కోర్టు ఈనెల 19నే యాసిన్ మాలిక్ను దోషిగా తేల్చింది. తాజాగా బుధవారం శిక్ష ఖరారు చేసింది. టెర్రర్‌ ఫండింగ్‌ కేసులో తనపై నమోదైన అన్ని అభియోగాలను యాసిన్‌ మాలిక్‌ అంగీకరించాడు. వాటిని కోర్టులో సవాలు చేయడానికి కూడా నిరాకరించాడు. దీంతో ఎన్‌ఐఏ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది.

1989లో జరిగిన కశ్మీరీ పండిట్​ల హత్యల్లోనూ జేకేఎల్​ఎఫ్​ నాయకుల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి.వీరి దురాగతాలతో కశ్మీర్​ నుంచి భారీ సంఖ్యలో పండిట్​లు వలస వెళ్లారు.1984లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే హత్య ఘటనతోనూ జేకేఎల్​ఎఫ్​ కు సంబంధాలు ఉన్నాయి.యాసిన్ పై UAPA సెక్షన్ 120-Bలోని సెక్షన్లు 16 (ఉగ్రవాద కార్యకలాపాలు), 17 (ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సేకరించడం), 18 (ఉగ్రవాద చర్యలకు కుట్ర), మరియు 20 (ఉగ్రవాద సమూహం లేదా సంస్థలో సభ్యుడు కావడం) కింద అభియోగాలు నమోదయ్యాయి. భారతీయ శిక్షాస్మృతిలో (నేరపూరిత కుట్ర), 124-A (దేశద్రోహం) కూడా అభియోగాలను అతడు ఎదుర్కొంటున్నాడు. 

యాసిన్ మాలిక్ కేసు విచారణ సాగిందిలా.. 

  • 2017లో యాసిన్ మాలిక్ తో పాటు మరో నలుగురు కశ్మీర్ వేర్పాటువాద నేతలపై ఎన్ఐఏ కేసు నమోదుచేసింది. అతడు ఉగ్రవాదులకు ఆర్థికసాయం చేస్తున్నాడని ఎన్ఐఏ ఆరోపించింది.
  • ఎన్ఐఏ కేసుకు సంబంధించిన చార్జిషీట్ 2019లో దాఖలైంది. 
  • 2019 ఫిబ్రవరి 26న యాసిన్ మాలిక్ ఇంట్లో ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహించాయి. 
  • 2019 ఏప్రిల్ 10న యాసిన్ మాలిక్ ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. 
  • 2022 మార్చి 16న  లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్​, హిజ్బుల్​ ముజాహిద్దీన్ చీఫ్​ సయ్యద్​ సలావుద్దీన్ ​ సహా పలువురు వేర్పాటువాద నేతలపై కూడా చార్జిషీట్ దాఖలు చేయాలని ఎన్​ఐఏ కోర్టు ఆదేశించింది. దీనికి అనుగుణంగా ఎన్ఐఏ వారిపైనా చార్జిషీట్లను దాఖలు చేసింది. 
  • 2022 మే 19న ఎన్ఐఏ కోర్టు యాసిన్ మాలిక్ ను దోషిగా తేల్చింది. ఉగ్రవాదులకు అతడు నిధులు అందించిన మాట వాస్తమేనని స్పష్టంచేసింది. ఈ కేసులో శిక్షను మే 25న ఖరారు చేస్తామని వెల్లడించింది. 

మరిన్ని వార్తలు.. 

స్పైస్ జెట్ పై సైబర్ దాడి.. ప్రయాణికుల అవస్థలు

పాతిక వేలకు డజను బకెట్లు