ఈ గాలి.. ఈ నీరు.. గందరగోళం.. కాలుష్య కాసారంలా భాగ్యనగరం.. ఏక్యూఐలో 354గా నమోదు

ఈ గాలి.. ఈ నీరు.. గందరగోళం.. కాలుష్య కాసారంలా భాగ్యనగరం.. ఏక్యూఐలో 354గా నమోదు
  • ఇబ్బంది పడుతున్న చిన్నారులు, వృద్ధులు
  • వాహనాల కాలుష్యానికి తోడైన ఫ్యాక్టరీల వ్యర్థాలు
  •  గాలిలో తేమ కణాలు పేరుకు పోవడంతో అవస్థలు 
  •  శ్వాసకోశ వ్యాధులు, తల తిరగడం, వాంతులతో సతమతం
  • పడిపోతున్న గాలి నాణ్యత

V6 హైదరాబాద్:
నవాబులు నిర్మించిన ముత్యాల నగరం కాలుష్య కాసారంలా మారింది. ఇక్కడి గాలి, నీరు అంతా కాలుష్యమయంగా మారింది. పెరుగుతున్న వాహనాల రద్దీ, మానవ తప్పిదాలు, కాలుష్య కారకాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ లో గాలి నాణ్యత పడిపోతున్నది. ఏటా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వాహనాలపై నియంత్రణ లేకపోవడంతో హైదరాబాద్ కాలుష్య నగరాల జాబితాలో చేరిపోయింది. నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండే బెంగళూరు, చెన్నై నగరాలు హైదరాబాద్ కంటే మెరుగ్గా ఉన్నాయి. 

ఓ వైపు ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. అక్కడి గాలి నాణ్యత పడిపో యిందని, వరుసగా రెండు రోజులు కూడా ఉండలేక పోతున్నానని సాక్షాత్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటు వేదికగా నే వెల్లడించడం సంచలనం రేకెత్తించింది. ఈ క్రమంలో కాలుష్యనియంత్రణకు బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. బీఎస్ 6 దాటిన వాహనాలనే నగరంలోకి అనుమతిస్తున్నారు. ఇందుకోసం తనిఖీలు చేస్తున్నారు. ఉదయంపూట మరీ ఎక్కువగా ఉంటోంది. ప్రధానంగా శీతా కాలంలో ఈ సమస్య తీవ్రంగా ఉంటోంది. 

హైదరాబాద్ లోనూ గాలిలో తేమ కణాలు పేరుకుపోవడం.. వాహనాల కాలుష్యం.. బాలానగర్, జీడిమెట్ల, తుక్కుగూడ, హకీంపేట, పటాన్ చెరు, ఐడీఏ బొల్లారం, కూకట్ పల్లి, నాచారం తదితర పారిశ్రా మిక ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వచ్చే జల, వాయు కాలుష్యం కారణంగా ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. జనవరి మొదటి వారం నుంచి ఈ సమస్య తీవ్రమైంది. ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారు. చాలా మంది పసికందుల కు నెబ్యూలైజర్స్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్ప డుతోందని పిల్లల వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా అస్తమా రోగులు అనేక అవస్థల పాలవుతున్నారు.


పారిశ్రామిక ప్రాంతాలు

  • బాలాపూర్
  • కూకట్పల్లి
  • పటాన్చెరు
  • జీడిమెట్ల
  • బాలానగర్
  • బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా
  • సనత్నగర్
  • తార్నాక

వాహన కాలుష్యం

  • సికింద్రాబాద్
  • మెహదీపట్నం
  • అమీన్ పూర్
  • మాదాపూర్
  • గచ్చిబౌలి (కొన్నిసార్లు)
  • బంజారా హిల్స్,
  • జూబ్లీహిల్స్

నిర్మాణాల కారణంగా..

  • ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, 
  • శేరిలింగంపల్లి తదితర ప్రాంతాలు

ఢిల్లీలో అలర్ట్

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర చలి, దట్టమైన పొగమంచు పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉత్తర భారతంలో కోల్డ్ వేవ్ ప్రభావంతో నగరంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఘనమైన ఫాగ్ ఏర్పడుతుండటం తో సాధారణ జీవనం దెబ్బతింటోంది. నిన్న ఢిల్లీ ఈ ఏడాది తొలి ‘కోల్డ్ డే'ను నమోదు చేసుకుంది. 

కనిష్ఠ ఉష్ణోగ్రత 8.6 డిగ్రీల సెల్సియస్గా నమోదవగా, గరిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీల వద్దే ఉండనుందని ఐఎండీ తెలిపింది. ఉదయం వేళల్లో తేమ స్థాయి 95 శాతానికి చేరుకోవడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. అటు వాయు కాలుష్యం కూడా ఆందోళనకర స్థాయిలో ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం ఇవాళ ఢిల్లీ సగటు ఏక్యూఐ 336గా నమోదై ‘వెరీ పూర్' కేటగిరీలోకి చేరింది. 

నెహ్రూ నగర్లో ఏక్యూఐ 360గా నమోదు కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. చలి, పొగమంచు ప్రభావంతో ఢిల్లీకి పొరుగు గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో అధికారు లు జనవరి 10 వరకు 8వ తరగతి వరకూ అన్ని పాఠ శాలలకు సెలవులు ప్రకటించారు. జనవరి 10 వరకు తెల్లవారుఝామున పొగమంచు కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరించింది.