ప్రపంచంలో అత్యంత క్రియాశీలకమైన అగ్నిపర్వతం.. మౌంట్ ఎట్నా బద్ధలైంది. 2026 న్యూ ఇయర్ రోజు .. జరిగిన విస్ఫోటనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంచు కొండల్లో ఉన్న ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా.. మంచు పై పారుతుంటే కనివిందు చేసిన సుందర దృశ్యం ఎంతగానో ఆకట్టుకుంది. లావా ప్రవహిస్తుంటే.. మంచు ముద్దలు సుయ్యిమంటూ కరుగుతూ.. మండుతూ.. ఆరెంజ్ కలర్ లో మండుతూ.. ఆ మంటలోనుంచి వచ్చే ఆవిర్లు.. అద్భుతమైన దృశ్యాలుగా కనువిందు చేశాయని.. వీడియోలు షేర్ చేస్తున్నారు నెటిజన్లు.
మౌంట్ ఎట్నాకు సంబంధించి ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఎట్నా శిఖరంపై మంచు మీద లావా ప్రవాహం.. మంచు కరుగుతూ మండుతుంటే.. వినసొంపైన శబ్దాలతో ఆవిర్లను ఉత్పత్తి చేస్తూ.. ఎరుపు-తెలుపు రంగులో రాత్రిపూట అందంగా కనిపించినట్లు షేర్ చేస్తున్నారు. ఆ రాత్రిలో.. ఎట్నా పేలిన సందర్భంలో హెడ్‌ల్యాంప్‌లు ధరించి కొందరు స్కైయింగ్ చేయడం వీడియోలో చూడవచ్చు.
ఎట్నా అగ్నిపర్వతం యూరప్ ఖండంలో ఉంది. ఇటలీలోని సిసిలీ ప్రాంతంలో ఉన్న ఈ పర్వతం అత్యంత క్రియాశీలకంగా.. అంటే ప్రపంచంలోని అన్ని పర్వతాల కంటే ఎక్కువగా పేలుతూ ఉంటుంది. మీడియావ్రాయ్(Mediavrai) అనే ట్విటర్ పేజ్ పోస్ట్ చేసిన క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నో అగ్నిపర్వతాల విస్ఫోటనం చూసినప్పటికీ.. మౌంట్ ఎట్నా లావా.. మంచుపై చేసే విన్యాసం ఎప్పటికీ ప్రత్యేకమేనని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ప్రకృతి దృశ్యం ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేసినట్లుగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ల్యాండ్ స్కేప్ పై బ్రష్ తో పెయింట్ వేస్తున్నంత అందంగా ఉందని వీడియో చూసిన వాళ్లు ఫిదా అవుతున్నారు. అయితే అది ఫేక్ కాదని.. న్యూఇయర్ రోజు జరిగిన విస్ఫోటనం తాలూకా లావా ఇంకా పారుతూనే ఉందని గ్రోక్ సమాధానం చెబుతోంది. అయితే అక్కడ స్కైయింగ్ చేయడం చాలా డేంజర్ అని.. లావా మీదపడి కాలిపోయే ప్రమాదం ఉటుంది.. విష వాయువులతో ప్రాణాలకు ముప్పు ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.
మౌంట్ ఎట్నా విస్ఫోటనం 2026 మొదటి రోజే జరిగినట్లు ఇటలీకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వోల్కనాలజీ (INGV) పేర్కొంది. తూర్పున ఉన్న వల్లే డెల్ బోవ్ పర్వత శ్రేణిలో ఉన్న లోయలో లావా బయటకు వచ్చినట్లు గుర్తించారు.
మౌంట్ ఎట్నా ప్రత్యేకతలు:
యూరప్‌లో అతిపెద్దదైన మౌంట్ ఎట్నా, ప్రపంచంలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటి. ఇటలీలోని రెండవ అతిపెద్ద అగ్నిపర్వతం అయిన మౌంట్ వెసువియస్ కంటే రెండున్నర రెట్లు పొడవుగా, పెద్దదిగా ఉంటుంది. 2025లో అల్లకల్లోలంగా మారి.. ఎప్పుడు పేలుతుందోననే భయాందోళనకు గురిచేసింది. ఎట్టకేలకు కొత్త సంవత్సరంలోఎట్నా విస్ఫోటనం చెందింది.
అయితే 2025 ఫిబ్రవరి నుంచి ఈ అగ్నిపర్వతం మూడు సార్లు బద్ధలైంది. ప్రతి విస్ఫోటనం కొన్ని ప్రత్యేక లక్షణాలతో తమను ఆశ్చర్యానికి గురిచేసినట్లు అగ్నిపర్వత శాస్త్రవేత్తల పేర్కొన్నారు.
2025 జూన్ లో జరిగిన ఒక విస్ఫోటనంలో అగ్ని కీలలు గాలిలోకి 21 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నట్లు చెబుతున్నారు. దీంతో పరిసర ప్రాంతాలలో సమస్యలు తలెత్తినట్లు పేర్కొన్నారు. అయిత ఈ సారి జరిగిన పేలుడు స్థానికులకు ఎటువంటి ప్రాణహాని కలిగించదని అధికారులు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
🔥🚨INSOLITE – Le volcan Etna, réactivé, a vu sa lave s'écouler sur la neige présente à son sommet, offrant un phénomène visuel de coexistence entre l'activité volcanique et les conditions hivernales. pic.twitter.com/CnAzx5EVFk
— Mediavrai (@MediavraiFR) January 6, 2026
