బిగ్ హిట్ లేకుండానే పాన్ ఇండియా మూవీస్ కి యాక్షన్, కట్

బిగ్ హిట్ లేకుండానే  పాన్ ఇండియా మూవీస్ కి యాక్షన్, కట్

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. చిన్ని హీరో నుండి పెద్ద హీరో వరకు..చిన్న డైరెక్టర్ నుండి పెద్ద డైరెక్టర్ వరకు పాన్ ఇండియాపై మోజు పడుతున్నారు. బాహుబలితో స్టార్ట్ అయిన పాన్ ఇండియా ట్రెండ్ ఇప్పుడు అందరినీ ఆవహించేస్తోంది. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు కొందరు దర్శకులు.


 
కొందరు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ పాన్ ఇండియా మూవీస్ అంటే జంకుతున్నారు. అయితే మీడియం రేంజ్ డైరెక్టర్స్ మాత్రం పాన్ ఇండియా సినిమాలకు యాక్షన్, కట్ చెప్పడానికి రెడీ అయ్యారు. ఇంద్రగంటి మోహన కృష్ణ డిఫరెంట్ సబ్జెక్టులను టేకప్ చేస్తాడని పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పటివరకు ఈయన స్టార్ హీరోని డైరెక్ట్ చేయలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మించే ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనుందట.

ఇక అడవిశేషుతో గూఢాచారి తీసి హిట్ కొట్టాడు శశికిరణ్ టిక్క. ప్రస్తుతం అడవిశేషుతోనే మేజర్ సినిమా తీశాడు. వచ్చేనెలలోనే అది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రెండో సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ లోకి వెళ్లాడు శశికిరణ్ టిక్క. మేజర్ సౌత్ తో పాటు నార్త్ లో కూడా రిలీజ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇక కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోణా కూడా పాన్ ఇండియా రిలీజే. ఈ మూవీ డైరెక్టర్ అనుప్ భండారి మీడియం రేంజ్ డైరెక్టర్ల లిస్ట్ లో ఉన్నాడు. 


 
అ! మూవీతో పాటు కల్కి, జాంబిరెడ్డి సినిమాలను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ కూడా పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో బిగ్ హిట్ లేకున్నా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ప్రజెంట్ ఈయన  సూపర్ హీరో కాన్సెప్ట్ తో హనుమాన్ అనే మూవీని తీస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. 

ఇక నిఖిల్ మొదటి పాన్ ఇండియా మూవీ స్పై. ఈ మూవీకి యాక్షన్ కట్ చెప్తున్నాడు గ్యారి బీహెచ్. గ్యారి బిహెచ్ కు ఇది ఫస్ట్ మూవీ. అదేవిధంగా సమంత పాన్ ఇండియా మూవీ యశోద. ఈ మూవీని హరి-హరీష్ సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్నారు. వీళ్లకు కూడా ఇది మొదటి సినిమా. ఇక ఈ మూవీని కూడా తెలుగు, తమిళ్,మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇలా బిగ్ హిట్ అంటేనే తెలియకుండానే పాన్ ఇండియా సినిమాలకు దర్శకులుగా మారుతున్నారు పలువురు డైరెక్టర్లు. మరి వీళ్ల పాన్ ఇండియా కళ నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.

మరిన్ని వార్తల కోసం

ప్రధానికి మొహం చూపించలేక కర్ణాటకకు కేసీఆర్

కూల్ డ్రింక్లో బల్లి.. ఔట్లెట్ సీజ్..