కూల్ డ్రింక్లో బల్లి.. ఔట్లెట్ సీజ్..

కూల్ డ్రింక్లో బల్లి.. ఔట్లెట్ సీజ్..

సరదాగా మెక్ డొనాల్డ్స్కు వెళ్లిన నలుగురు స్నేహితులకు చేదు అనుభవం ఎదురైంది. ఆర్డర్ చేసిన కూల్ డ్రింక్లో చచ్చిన బల్లి దర్శనమిచ్చింది. విషయాన్ని ఔట్లెట్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో బాధితులు వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో స్పందించిన మున్సిపల్ అధికారులు సదరు ఔట్ లెట్ను సీజ్ చేశారు.

అహ్మదాబాద్ కు చెందిన భార్గవ్ జోషి శనివారం నలుగురు ఫ్రెండ్స్తో కలిసి మెక్ డొనాల్డ్స్కు వెళ్లారు. సాఫ్ట్ డ్రింక్తో పాటు మరికొన్ని ఫుడ్ ఐటెమ్స్ ఆర్డర్ చేశారు. సరదాగా మాట్లాడుకుంటూ కూల్ డ్రింక్ సిప్ చేస్తున్న ఫ్రెండ్స్ కు ఒక్కసారిగా షాక్ తగిలింది. భార్గవ్ స్నేహితుడి సాఫ్ట్ డ్రింక్ గ్లాసులో చచ్చిన బల్లి దర్శనమిచ్చింది. విషయనాన్ని మెక్ డొనాల్డ్స్ స్టాఫ్ దృష్టికి తీసుకెళ్లగా వారు పట్టించుకోలేదు. దాదాపు 4 గంటల పాటు వేచిచూసినా ఎవరూ స్పందించకపోవడంతో భార్గవ్ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 

భార్గవ్ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మెక్ డొనాల్డ్స్ తీరుపై నెటిజన్లు ఎండగట్టారు. విషయం అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దృష్టికి వెళ్లడంతో అధికారుల రంగంలోకి దిగారు. మెక్ డొనాల్డ్స్ ఔట్ లెట్ను సీజ్ చేశారు.  గ్రేట్ వర్క్ డన్ బై ఏఎంసీ అనే క్యాప్షన్ తో ఔట్ లెట్ను సీజ్ చేసిన ఫొటోను భార్గవ్ జోషి ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.

మరిన్ని వార్తల కోసం..

ఆ ఊరి అబ్బాయిలకు పెళ్లి కష్టాలు

ప్రధానికి మొహం చూపించలేక కర్ణాటకకు కేసీఆర్