ప్రధానికి మొహం చూపించలేక కర్ణాటకకు కేసీఆర్

ప్రధానికి మొహం చూపించలేక కర్ణాటకకు కేసీఆర్

ప్రధాని మోడీకి మొహం చూపించలేక సీఎం కేసీఆర్ కర్టాటక టూర్ కి వెళ్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. రేపు హైదరాబాద్ కు వస్తున్న మోడీకి ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. బేగంపేట్ ఎయిర్ పోర్టులో ఈ ఏర్పాట్లను  బీజేపీ OBC మోర్చా జాతీయాధ్యక్షులు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు చింతల, NVSS ప్రభాకర్ పరిశీలించారు. ప్రధానికి స్వాగతం పలికే ఆనవాయితిని కేసీఆర్ కాలరాశారన్నారు లక్ష్మణ్. సీఎం నిబంధనలు పాటించకుండా నియంతల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతులను పట్టించుకోని కేసీఆర్..ఇతర రాష్ట్రాల్లోని రైతులకు డబ్బలు ఇవ్వడం గమనార్హమన్నారు. ఎయిర్ పోర్టులో ప్రధానికి పార్టీ తరుపున సన్మానం చేస్తామన్నారు.

కాగా రేపు మధ్యాహ్నం 1.25 నిమిషాలకు బేగంపేట్ కు చేరుకోనున్నారు ప్రధాని. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కి చేరుకుంటారు. మధ్యాహ్నం 2నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బీ 20వ స్నాతకోత్సంలో మోడీ పాల్గొంటారు. సాయంత్రం 3.55 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్తారు. 

మరిన్ని వార్తల కోసం

ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ 

మనాలీలో అఖిల్ భయపెట్టించే యాక్షన్ సీన్స్