ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ 

ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ 

హైదరాబాద్: ప్రధాని మోడీ రేపు హైదరాబాద్ కు రానున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు రిలీజ్ చేశారు. 

ప్రధాని పర్యటన షెడ్యూల్

ప్రధాని నరేంద్ర మోడీ రేపు (గురువారం) మధ్యాహ్నం 1.25 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రోడ్డు మార్గాన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కి చేరుకుంటారు. మధ్యాహ్నం 2నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బీ వార్షికోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 3.55 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్తారు. 

కాగా... ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.  ఐఎస్‌బీతో పాటు బేగంపేట విమానాశ్రయం, హెచ్‌సీయూలలో భారీ ఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. ఒక్క ఐఎస్‌బీలోనే 2వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. సైబరాబాద్ ఇన్‌ఛార్జి కమిషనర్ సీవీ ఆనంద్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ప్రధాని పర్యటన సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు  ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

మరిన్ని వార్తల కోసం...

మంత్రి జగదీశ్ రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి ఆరోపణలు

సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్