మంత్రి జగదీశ్ రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి ఆరోపణలు

మంత్రి జగదీశ్ రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి ఆరోపణలు

విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి చెరువును మంత్రి జగదీశ్వర్ రెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. మంత్రి బినామీ జీవన్ రెడ్డి పేరు మీద ఆక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. సర్వే నెంబర్ 480, 481,550 లావణ్య పట్టాల్లోని ల్యాండ్ ను..20 ఎకరాల బంజరు భూమి, బఫర్ జోన్ లోని 10 ఎకరాల భూమిని ఆక్రమించారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి. లేదంటే నార్కట్ పల్లి గ్రామస్తులతో కలిసి చెరువులో అక్రమంగా వేసిన రోడ్డును తొలగిస్తామని హెచ్చరించారు. ఎంపీ కోమటి రెడ్డి ఆరోపణలతో అలెర్ట్ అయ్యారు ఇరిగేషన్ అధికారులు. హడావిడిగా నార్కట్ పల్లిలో కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చేస్తున్నారు. బఫర్ జోన్ లో రోడ్డు వేసినట్లు గుర్తించామన్నారు అధికారులు. సర్వే కంప్లీట్ అయ్యాకా పూర్తి వివరాలు చెబుతామన్నారు.