తగ్గిన సోప్ లు, కాస్మొటిక్స్ తయారీ

తగ్గిన సోప్ లు, కాస్మొటిక్స్ తయారీ
  • తగ్గిపోయిన సేల్స్
  •  పడిపోయిన ఔట్‌పుట్‌
  •  దెబ్బతిన్న సప్లై చెయిన్

దేశంలో అతిపెద్ద కన్జూమర్ గూడ్స్ కంపెనీ హిందుస్తాన్ యునిలివర్(హెచ్‌యూఎల్) రోజువారీ సేల్స్, ఫ్యాకరీ ఔట్‌ పుట్‌ 40 శాతం వరకు తగ్గిపోయాయి. కరోనా లాక్‌‌డౌన్‌‌తో లేబర్ కొరత, ట్రాన్స్‌‌ పోర్ ప్రాబ్లమ్స్ వల్ల సాధారణంగా నమోదయ్యే సేల్స్, ఔట్‌ పుట్‌ భారీగా పడిపోయింది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్ విధించడంతో, మార్చిమధ్యలో నుంచి సప్లై చెయిన్‌‌కు అంతరాయం ఏర్పడింది. మార్చి చివరి వారం నుంచి హెచ్‌యూఎల్ సేల్స్ తగ్గిపోవడం ప్రారంభమైనట్టు కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు . తమ ఫ్యాక్టరీ లో మ్యాన్‌‌ పవర్ కొరత, డిస్ట్రిబ్యూషన్ సెంటరకు వెహికిల్స్, ట్రక్కుల రాకపోకలు నిలిచిపోవడం కంపెనీకి అతిపెద్ద సవాలుగా మారినట్టు సంస్థకు చెందిన ఓ అధికారి చెప్పారు. ఇది తమ సప్లై చెయిన్ పార్టనర్ పై కూడా తీవ్ర ప్రభావం చూపినట్టు పేర్కొన్నా రు. పోర్టుల్లోనూ ఆంక్షలు అమలవుతుండటం వల్ల ముడి సరుకులను సేకరించలేకపోతున్నారు .

10-12 శాతం షేరు దీనిదే…

ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) మార్కెట్‌‌లో హెచ్‌యూఎల్‌‌కు 10–12 శాతానికి పైగా వాటా ఉంది. ఈ కంపెనీ షేరు బుధవారం భారీగా పెరిగి, మార్కెట్ క్యాప్ విషయంలో టాప్ 13 కం పెనీల్లో ఒకటిగా నిలిచింది. కానీ గురువారం రోజు మళ్లీ 3.5 శాతం మేర పడిపోయింది. లాక్డౌన్ వల్ల కన్జూమర్లు పప్పులను, గ్రోసరీలను ఎక్కువగా కొంటున్నారు. మరోవైపు ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలనే మూసివేస్తున్నది. దీంతో ప్రొడక్షన్ తగ్గింది.

ఆంక్షలు సడలించండి…

పట్టణా ల్లోమాత్రమే కొన్ని ఫ్యాక్టరీలు రన్ అవుతున్నాయి. వైరస్ పెరుగుతుందనే భయంతో ఉద్యోగులు కూడా ఎక్కువగా ఫ్యాక్టరీలకు రావడం లేదు. సరుకులు రవాణా చేసే ట్రక్కులకు ఇబ్బంది లేకుండా చూడాలని హెచ్ యూఎల్ ప్రభుత్వాలను కోరింది. ఫ్యాక్టరీల్లో, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పనిచేసే వారిపై ఆంక్షలు తొలగించాలని పేర్కొంది. కన్జూమర్ల డిమాండ్‌‌ను చేరుకోవడానికి సహకరించాలని కోరింది.