భారీగా నష్టపోయిన రిలయన్స్​ షేరు​

భారీగా నష్టపోయిన రిలయన్స్​ షేరు​
  • తగ్గిపోయిన టాప్ కంపెనీల మార్కెట్ క్యాప్
  • ఆర్‌ఐఎల్‌కు బాగా దెబ్బ
  • నెంబర్ వన్ లో టీసీఎసే

ముంబై : దేశీయ స్టాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో అత్యంత విలువైన కంపెనీలుగా పేరున్న టాప్ 10 సంస్థల్లో ఆరు గతవారం భారీగా తమ మార్కెట్‌‌‌‌ క్యాప్‌‌‌‌ను కోల్పోయాయి. మార్కెట్ వాల్యుయేషన్‌‌‌‌లో రూ.53,458.8 కోట్లను ఈ సంస్థలు పోగొట్టుకున్నట్టు తెలిసింది. వీటిలో అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌‌‌‌‌‌‌‌ఐఎల్) మార్కెట్ క్యాప్ పడిపోయింది. ఆర్‌‌‌‌‌‌‌‌ఐఎల్‌‌‌‌ వాల్యుయేషన్ రూ.23,929.9 కోట్లు తగ్గి రూ.8,10,889.80 కోట్లుగా నమోదైనట్టు తాజా డేటాలో వెల్లడైంది. ఆర్‌‌‌‌‌‌‌‌ఐఎల్‌‌‌‌తో పాటు టీసీఎస్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్, హెచ్‌‌‌‌యూఎల్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ, ఐటీసీ వంటి బ్లూచిప్ కంపెనీల మార్కెట్ క్యాప్ క్షీణించినట్టు మార్కెట్ డేటాలో తెలిసింది. అయితే ఇన్ఫోసిస్, ఎస్‌‌‌‌బీఐ, కొటక్ మహింద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌ల మార్కెట్ క్యాప్ మాత్రం పెరిగింది.

పెద్ద కంపెనీలే అయినా..

హెచ్‌‌‌‌యూఎల్ మార్కెట్ క్యాప్ రూ.12,177 కోట్లు తగ్గి, రూ.3,82,888.36 కోట్లకు చేరింది. హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ మార్కెట్ క్యాప్ రూ.7,148.88 కోట్లు పడిపోయి రూ.3,68,796.02 కోట్లుగా, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ క్యాప్ రూ.4,785.48 కోట్లు తగ్గి రూ.6,60,069.81 కోట్లుగా రికార్డయ్యాయి. ఐటీసీ వాల్యుయేషన్ రూ.4,535.7 కోట్లు, టీసీఎస్ వాల్యుయేషన్ రూ.881.81 కోట్లు తగ్గిపోయాయి.  ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.8,363.86 కోట్లు పెరిగి రూ.2,77,957.03 కోట్లుగా నమోదైంది. ఎస్‌‌‌‌బీఐ మార్కెట్ క్యాప్ రూ.4,997.78 కోట్లు ఎగిసి రూ.3,11,870.55 కోట్లుగా ఉంది. ఇన్ఫోసిస్ కూడా తన మార్కెట్ క్యాప్‌‌‌‌కు రూ.4,500 కోట్లు యాడ్ చేసుకుంది. కొటక్ మహింద్రా బ్యాంక్ వాల్యుయేషన్ రూ.3,071.75 కోట్లు పెరిగింది. మార్కెట్ క్యాప్‌‌‌‌లు బాగా తగ్గిపోయినా టాప్ 10 సంస్థల్లో టీసీఎస్‌‌‌‌ నెంబర్. వన్ స్థానాన్ని అలానే అట్టిపెట్టుకుంది. దాని తర్వాత ఆర్‌‌‌‌‌‌‌‌ఐఎల్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్, హెచ్‌‌‌‌యూఎల్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఎస్‌‌‌‌బీఐ, కొటక్ మహింద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి. గత వారం సెన్సెక్స్ 257.58 పాయింట్లు పడిపోయి 39,194.49 వద్ద క్లోజైన సంగతి తెలిసిందే.