ఎక్కువ సంతోషపడినా ప్రాణం ప్రమాదంలో పడ్డట్టే..

ఎక్కువ సంతోషపడినా ప్రాణం ప్రమాదంలో పడ్డట్టే..

మంచిగున్న మనిషిని కూడా మనాది మంచం పట్టిస్తదన్న విషయం తెలిసిందే. కానీ, ఎక్కువ సంతోషపడినా ప్రాణం ప్రమాదంలో పడ్డట్టే అంటున్నరు రీసెర్చర్లు. దీన్నే ‘టాకోట్సుబో సిండ్రోమ్’ అని పిలుస్తరట సైన్స్​ భాషలో. హ్యాపీ హార్ట్​ సిండ్రోమ్​ అనేది కామన్​ నేమ్​.

పీటల మీద  పెండ్లి కొడుకు సోయి తప్పిండు.. ఫలానా మనిషి నవ్వుతూనే కుప్పకూలిపోయిండు.. లాంటి వార్తలు చాలానే కనిపిస్తున్నయ్​​ ఈ మధ్య. అదే టాకోట్సుబో సిండ్రోమ్ అంటున్నరు స్విట్జర్​లాండ్​​లోని ‘యూనివర్సిటీ హాస్పిటల్​ జురిచ్’​ రీసెర్చర్లు. అయితే కొన్నేండ్ల కిందట చేసిన స్టడీలో మనిషి బాధల్లో ఉన్నప్పుడు, తట్టుకోలేని స్ట్రెస్​ కలిగినప్పుడు,  విపరీతమైన కోపం, భయం లాంటి వాటివల్ల ఈ సిండ్రోమ్​ బారిన పడతరని తేలింది. కానీ, ఈ మధ్య చేసిన స్టడీల్లో..  పట్టరాని సంతోషం కూడా టాకోట్సుబో సిండ్రోమ్​కి  కారణమని తేలింది. అయితే ఇదే స్టడీలో ఇంతకుముందుతో పోల్చితే బాధ వల్ల ఈ సిండ్రోమ్​ బారిన పడుతున్నోళ్ల సంఖ్య బాగా పెరిగిందని తేలింది. 

స్టడీ ఇట్ల చేసిన్రు
తొమ్మిది దేశాల్లోని 485 మంది టాకోట్సుబో సిండ్రోమ్ పేషెంట్ల మీద ఈ స్టడీ చేసిన్రు. వీళ్లలో  ప్రతి ఇరవైమందిలో ఒకరికి సంతోషాన్ని తట్టుకోలేక  ఈ సమస్య వచ్చిందట. అయితే ఈ రెండు సందర్భాలు వేరువేరు అయినా.. గుండెపై వీటి ప్రభావం మాత్రం ఒకేలా ఉంటుందంటున్నరు  రీసెర్చర్​లు. వీటివల్ల  గుండె గదుల్లో ముఖ్యమైంది అయిన ఎడమ జఠరిక షేప్​లో మార్పులొస్తయట​. ఆక్సిజన్​తో నిండిన బ్లడ్​ని శరీరానికి పంపించే ఇది సిరామిక్​ కుండల షేప్​లోకి వస్తదట.. దాంతో గుండె కండరాలకి  రక్తాన్ని సరఫరా చేసే శక్తి లేక ఛాతిలో నొప్పి వచ్చి కుప్పకూలిపోతరు. ఈ సమస్య మగవాళ్లతో పోల్చితే  ఆడవాళ్లలోనే  ఎక్కువ ఉందట. అలాగే  మైల్​ స్టోన్​ పుట్టినరోజులు, పెండ్లి రోజు, మనవళ్లు, మనవరాళ్లు పుట్టినప్పుడు, లాటరీ టికెట్లు.. పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినప్పుడు హ్యాపీ హార్ట్​​ సిండ్రోమ్​ బారిన ఎక్కువ పడుతున్నరు అంటున్నరు రీసెర్చర్లు.