అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రూ. 15కోట్ల 81లక్షల 41వేల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 16 నుంచి 21తేదీ వరకు కురిసిన అకాల వర్షాలతో.. పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దఎత్తున నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 10 జిల్లాల్లో వర్షాలతో అన్నదాతలు నష్టపోయారు. మరోవైపు రైతు భరోసా నిధులు విడుదల చేసింది వ్యవసాయశాఖ. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు వారికి నిధులు విడుదల చేసిన సర్కార్.. సోమవారం ఐదు ఎకరాలు పై బడిన రైతులకు ఫండ్స్ రిలీజ్ చేసింది. రైతు భరోసా కోసం రూ. 2 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది రేవంత్ సర్కార్.
