T20 World Cup 2024: 43 ఏళ్ల వయస్సులో ప్రపంచ కప్.. ఉగాండా, స్కాట్లాండ్ జట్ల ప్రకటన

T20 World Cup 2024: 43 ఏళ్ల వయస్సులో ప్రపంచ కప్.. ఉగాండా, స్కాట్లాండ్ జట్ల ప్రకటన

జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం ఉగాండా, స్కాట్లాండ్ క్రికెట్ బోర్డులు ఆయా జట్లను ప్రకటించాయి. క్వాలిఫైయింగ్‌ పోరులో బలమైన జింబాబ్వేను మట్టికరిపించి ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన ఉగాండా జట్టుకు బ్రియాన్ మసాబా నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో 43 ఏళ్ల ఫ్రాంక్ న్సుబుగాకు చోటు దక్కడం గమనార్హం. ఉగాండా జట్టు.. సీనియర్ పురుషుల ప్రపంచ కప్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. వారు మెగా టోర్నీలో జూన్ 3న ఆఫ్ఘనిస్తాన్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనున్నారు.

ఇక స్కాట్లాండ్ పేరుకు పసికూన జట్టు అయినప్పటికీ.. తమదైన రోజు అగ్రశ్రేణి జట్లకు షాకివ్వగలదు. ఈ జట్టుకు రిచీ బెరింగ్టన్ సారథ్యం వహించనున్నాడు. మాథ్యూ క్రాస్, బ్రాడ్ వీల్, మార్క్ వాట్, జార్జ్ మున్సే వంటి పలువురు ఆటగాళ్లకు ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం ఉండటంతో స్కాట్లాండ్ కాస్త బలంగానే కనిపిస్తోంది.

స్కాట్లాండ్ జట్టు:

రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, బ్రాడ్ క్యూరీ, క్రిస్ గ్రీవ్స్, ఓలి హెయిర్స్, జాక్ జార్విస్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, మార్క్ వాట్, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, చార్లీ బి, వాల్ టియర్. 

ఉగాండా జట్టు:

బ్రియాన్ మసాబా (కెప్టెన్), రియాజత్ అలీ షా (వైస్ కెప్టెన్), కెన్నెత్ వైస్వా, దినేష్ నక్రానీ, ఫ్రాంక్ న్సుబుగా, రోనక్ పటేల్, రోజర్ ముకాసా, కాస్మాస్ క్యేవుటా, బిలాల్ హస్సన్, ఫ్రెడ్ అచెలం, రాబిన్సన్ ఒబుయా, సైమన్ స్సేసాజి, హెన్రీ జుసెనియోండో, అల్పెన్యోండో, అల్పెన్యోండో మియాజీ.

రిజర్వ్ ఆటగాళ్లు: రోనాల్డ్ లుటాయా, ఇన్నోసెంట్ మ్వెబాజ్.

20 జట్ల మధ్య సమరం

మొత్తం 20 జట్లు తలపడే ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్, భారత్, నేపాల్, న్యూజిలాండ్, ఒమన్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, ఉగాండా దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించగా.. ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్, పపువా న్యూ గినియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు తమ జట్లను ప్రకటించాల్సి ఉంది.