హైటెక్ సిటీ టూ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్.. రివర్సల్ సిస్టం

హైటెక్ సిటీ టూ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్.. రివర్సల్ సిస్టం

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు సింగిల్ లైన్ సిస్టం ద్వారా రైళ్ళను నడిపిన మెట్రో మంగళవారం నుంచి హైటెక్ సిటీ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు రివర్సల్ సిస్టం ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విషయంపై మెట్రో ఎండి ఎన్.వి.ఎస్ రెడ్డి మాట్లాడుతూ.. రివర్సల్ సిస్టం అందుబాటులోకి రావడంతో మరో 2,3 వారాల వరకు  అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు  ప్రతీ 4 నిమిషాలకు ఒక మెట్రో రైలు నడుపుతామని తెలిపారు. తర్వాత పరిస్థితిని బట్టి 3 నిమిషాలకు ఒక రైలు నడుపుతామన్నారు

రివర్సల్ సిస్టం అందుబాటులోకి రావడంతో ఐటీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరమని మెట్రో ఎండీ అన్నారు. LB  నగర్ నుంచి మియాపూర్ రూట్ లో 5 నిమిషాలకు ఒక రైలు నడుపుతున్నామని ఆయన అన్నారు.