క‌డ‌ప్ప: వ‌ర్మ వాయిస్‌తో వెబ్ సిరీస్ వీడియో రిలీజ్

క‌డ‌ప్ప: వ‌ర్మ వాయిస్‌తో వెబ్ సిరీస్ వీడియో రిలీజ్

సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క‌త్వంలో కొత్త కొత్త రికార్డులు సృష్టించిన వ‌ర్మ.. ఇప్పుడు వివాదాస్ప‌ద సినిమాలు, బ‌యోపిక్‌లు, అడ‌ల్ట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ త‌న‌దైన కొత్త ట్రెండ్‌లో వెళ్తున్నాడు. కొన్నేండ్ల క్రిత‌మే రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌తో ప‌రిటాల ర‌వి చ‌రిత్ర ఆధారంగా ర‌క్త చ‌రిత్ర సినిమా రెండు పార్టులుగా తీశాడు. ఇవి అప్ప‌ట్లో పొలిటిక‌ల్‌గా కూడా హీట్ పుట్టించిన సినిమాలు. ఆ త‌ర్వాత వంగ‌వీటి చ‌రిత్ర‌, ఎన్టీఆర్ చ‌రిత్ర తీసిన ఆర్జీవీ.. మ‌ళ్లీ 2019 ఎన్నిక‌లు ముగిశాక‌ రాయ‌ల‌సీమ నేత‌లు జ‌గ‌న్, చంద్ర‌బాబుల సెంట్రిక్‌గా మూవీ తెర‌కెక్కించారు. ఫ్యాక్ష‌న్‌కు సంబంధించి ఒక వెబ్ సిరీస్ తీయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించి సంచ‌ల‌నానికి తెర‌తీశారు. రాయ‌ల‌సీమ అంటే ఫ్యాక్ష‌న్ అన్న‌ట్టుగా చిత్రిస్తే ఒప్పుకొనేది లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు అనేక సంఘాల నుంచి కూడా వ్య‌తిరేక‌త వ‌చ్చింది. అయితే ఇప్పుడు అదే కాన్సెప్ట్‌తో క‌డ‌ప్ప అనే టైటిల్‌తో వెబ్ సిరీస్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వ‌ర్మ ట్వీట్ చేశాడు.

"Sneak peek of KADAPPA web series… పగల మూలంగా రాయలసీమలో వందల మంది ప్రాణాలు బలితీసుకున్న ఫ్యాక్షన్ వార్‌ల‌ నేపథ్యంలో తీస్తున్న మెగా వెబ్ సీరీస్‌కి సంబంధించిన వీడియో ఇది. నేషనల్ లెవెల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ వెబ్ సీరీస్ పేరు కడప్ప" అంటూ రామ్ గోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో వీడియో రిలీజ్ చేశాడు. ఓపెనింగ్ టైటిల్స్‌లో కంటికి క‌న్ను స‌మాధానం కాదు అన్న గాంధీజీ మాట‌ల‌ను పెట్టి ఆ వెంట‌నే ప్ర‌తీకార‌మే ప‌ర‌మ‌సోపానం అన్న మాట‌ల‌ను చేర్చాడు ఆర్జీవీ. క‌డ‌ప‌..క‌డ‌ప‌ అంటూ రామ్ గోపాల్ వ‌ర్మ వాయిస్ బ్యాగ్రౌండ్‌లో వ‌స్తోంది. సీన్స్ మొత్తం చాలా క్రూరంగా, హింసాత్మ‌కంగా ఉన్నాయి. సీజ‌న్-1 అతి త్వ‌ర‌లో అంటూ వీడియోను ముగించాడు. ప‌రిటాల హ‌రి, ప‌రిటాల ర‌వి నిజ‌ జీవితాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తీస్తున్న‌ట్టు ఈ వీడియో నేమ్ ప్లేట్స్‌లో వేశాడు. ఈ వెబ్ సిరీస్‌కు అగస్త్య మంజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.