రిలయన్స్ రైట్స్ ఇష్యూకు భారీ రెస్పాన్స్

రిలయన్స్ రైట్స్ ఇష్యూకు భారీ రెస్పాన్స్

రూ.84 వేల కోట్లు సమకూర్చుకున్న ఆర్ఐఎల్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) మెగా రైట్స్ ఇష్యూకు ఇన్వెస్టర్స్ నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ దెబ్బకు ఆర్ఐఎల్ ఏకంగా రూ.84 వేల కోట్లను సమకూర్చుకుంది. బుధవారం రైట్స్ ఇష్యూ ముగింపు సందర్భంగా ఆర్ఐఎల్ 1.59 రెట్లు ఎక్కువ సబ్ స్క్రిప్షన్ పొందిందని, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ తోపాటు లక్షలాది చిన్న ఇన్వెస్టర్స్ , వేలాది ఇండస్ట్రీయల్ పెట్టుబడిదారుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చిందని తెలిపింది. అలాగే రైట్స్ ఇష్యూలో పబ్లిక్ పోర్షన్ నుంచి 1.22 టైమ్స్ సబ్ స్క్రిప్షన్స్ వచ్చాయని ఓ ప్రకటనలో పేర్కొంది. జూన్ 10వ తేదీన షేర్స్ అలాట్‌మెంట్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. ఈ నెల 12న ఆయా షేర్స్‌ను బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్స్‌ఛేంజెస్‌లో సెపరేట్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఐఎస్ఐఎన్) లిస్ట్ అవుతాయని పేర్కొంది.