సమాజ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ ముగ్గురూ పిల్లలను కనాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం ( ఫిబ్రవరి 17) సరస్వతి మందిర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. . సగటు సంతానోత్పత్తి రేటు .. భర్తీ స్థాయిల కంటే తక్కువగా ఉన్న సమాజాలు చివరికి అంతరించిపోయే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్ ..లఖ్‌నవూలోని... సరస్వతి శిశు మందిర్‌లో జరిగిన సామాజిక సామరస్య సమావేశంలో భగవత్ మాట్లాడుతూ, హిందూ కుటుంబాలు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని ప్రతిపాదించారు. సగటు సంతానోత్పత్తి రేటు భర్తీ స్థాయిల కంటే తక్కువగా ఉన్న సమాజాలు చివరికి అదృశ్యమయ్యే ప్రమాదం ఉందన్నారు. కొత్తగా పెళ్లయిన వారికి జనాభా పెరుగుదల గురించి అవగాహన కల్పించాలన్నారు. పెళ్లి చేసుకున్నవారు జనాభాను సృష్టించాలన్నారు.
హిందువుల మధ్య ఎలాంటి వివక్షత ఉండకూడన్న ఆయన ప్రతి హిందువును ఆలయాల్లోకి అనుమతించాలన్నారు. పిల్లలకు సంపాదించడంతోపాటు ఇతరులకు సాయం చేయడం కూడా నేర్పాలని భగవత్ అన్నారు. అక్రమ వలసలపై కఠిన చర్యలను తీసుకోవాలన్నారు. హిందూ మతంలోకి తిరిగి వచ్చే వారిని స్వాగతించి మద్దతు ఇవ్వాలని.. "ఘర్ వాపసీ" (పునఃమార్పిడి) విధానాన్ని ఆయన సమర్థించారు.
హిందువులను ఐక్యం చేయాలన్న భగవత్.. ఎటువంటి ముప్పు లేదు... కానీ అప్రమత్తత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సిక్కు, బౌద్ధ, జైన వర్గాల ప్రతినిధులతో పాటు ఇస్కాన్ ,ఆర్ట్ ఆఫ్ లివి..ఫౌండేషన్ సంస్థలు పాల్గొన్నాయి.
