న్యాయవాదుల రక్షణ చట్టం.. ఆమోదం చారిత్రాత్మకం

న్యాయవాదుల రక్షణ చట్టం.. ఆమోదం చారిత్రాత్మకం

ఆమనగల్లు, వెలుగు : న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్​పర్సన్ పొన్నం అశోక్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆమనగల్లులో న్యాయవాదుల రక్షణ బిల్లు ఆమోదాన్ని హర్షిస్తూ నిర్వహించిన సంబరాల్లో ఆయన మాట్లాడారు. న్యాయవాదులపై దాడులను అరికట్టి వారికి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

న్యాయవాదుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని, ఆమనగల్లు కోర్టు భవన నిర్మాణంతో పాటు షాద్‌‌‌‌‌‌‌‌నగర్ సబ్ కోర్టును మహేశ్వరంకు మార్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఆమనగల్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదిలాల్, సభ్యులు పొన్నం అశోక్ గౌడ్‌‌‌‌‌‌‌‌ను ఘనంగా సన్మానించారు.