న్యాయాధికారుల ముట్టడి వెనుక కుట్ర.. బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ వత్తాసు పలికాయి: సీఎం మమత

న్యాయాధికారుల ముట్టడి వెనుక కుట్ర.. బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ వత్తాసు పలికాయి: సీఎం మమత

హరిరాంపూర్(బెంగాల్): మాల్దా జిల్లాలో న్యాయాధికారులను ఘెరావ్ చేసిన ఘటన వెనుక ఎంఐఎం, ఐఎస్ఎఫ్ హస్తం ఉందని, వీరికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వత్తాసు పలికాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం దక్షిణ దినాజ్‌‌‌‌‌‌‌‌పూర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. 

న్యాయాధికారులను గంటల తరబడి బంధించడం వెనుక ఉన్న మాస్టర్ మైండ్, అడ్వకేట్ మొఫాక్కరుల్ ఇస్లాంను రాష్ట్ర సీఐడీ అరెస్ట్ ​చేసిందన్నారు. కాగా, బీజేపీ ఆ నిందితుడిని ఎంఐఎం నుంచి అప్పుగా తెచ్చుకుందని, ఐఎస్ఎఫ్ వారితో కలిసిందని, కాంగ్రెస్ కూడా దీనికి ఉసిగొల్పిందని సీఎం పేర్కొన్నారు. బెంగాల్‌‌‌‌‌‌‌‌లో అశాంతిని సృష్టించేందుకు బయటి నుంచి గూండాలను రప్పిస్తున్నారని మండిపడ్డారు.