శబరిమల తొలిరోజు ఆదాయం రూ.3 కోట్ల 32 లక్షలు

శబరిమల తొలిరోజు ఆదాయం రూ.3 కోట్ల 32 లక్షలు

శబరిమల: శబరిమలకు తొలిరోజు రూ.3 కోట్ల 32 లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. గత ఏడాది ఫస్ట్‌‌ డే టెంపుల్‌‌ వద్ద టెన్షన్‌‌ కారణంగా కేవలం కోటీ 28 లక్షల ఆదాయం మాత్రమే వచ్చిందని దేవస్థానం బోర్డ్‌‌ ప్రెసిడెంట్‌‌ ఎన్‌‌.వాసు మీడియాకు చెప్పారు. 40 వేల మంది భక్తులకు అన్నదాన ఏర్పాట్లు చేశామని, తాగునీటితోపాటు ఇతర సౌకర్యాలు కల్పించినట్టు చెప్పారు. మరోవైపు  అయ్యప్ప స్వామి భక్తులతో శబరిమల సోమవారం కిటకిటలాడింది. ఈ నెల 16న ఆలయం తెరిచారు. మూడు రోజుల్లో మాలలు ధరించి వచ్చిన 70,000 మంది స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ వర్గాలు చెప్పాయి. టెంపుల్‌‌ తెరుచుకున్న రెండో రోజైన ఆదివారం ఉదయం భారీ వర్షం వల్ల భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆలయ ప్రధాన పూజారి ఏకే సుధీర్‌‌ వేకువజామున 3 గంటలకు గర్భగుడి తెరిచి అభిషేకం చేసి పూజ ప్రారంభించారు.