
ఇండియన్ క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గ్రౌండ్ నుంచి రిటైర్ అయ్యారే కానీ.. ఫ్యాన్స్ గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలం. ఎందరు కొత్త ఆటగాళ్లు వచ్చినా.. ఎంతగా మెరిసినా.. సచిన్ ప్లేస్ ఎప్పటికీ క్రికెట్ రారాజుగా అలానే ఉంటుంది. దీనిని నిరూపించే ప్రత్యక్ష సాక్ష్యమే ఈ ఫొటో. సచిన్ జెర్సీతో ఉన్న ఈ బుడ్డోడి పేరు శ్రేష్ఠ్ మెహతా. 10 నెలల వయసున్న ఈ బుడతడి ఫొటోను తన మేనమామ ఆనంద్ మెహతా సచిన్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. హైదరాబాద్‌కు చెందిన అతడు ఎల్బీ స్టేడియానికి మేనల్లుడిని తీసుకెళ్లినప్పుడు తీసిన ఫొటోలివి. ఫిబ్రవరి 16న అతడు ఈ ఫొటోలను ట్వీట్ చేశాడు. ‘సచిన్ సార్.. మీరు క్రికెట్ నుంచి రిటైర్ అయినా.. మా గుండెల్లో నుంచి ఎప్పటికీ రిటైర్ అవ్వరు. మా లిటిల్ మాస్టర్ (శ్రేష్ఠ్ మెహతా) తరఫు నుంచి లిటిల్ మాస్టర్ బ్లాస్టర్‌కు చిరు సత్కారం’ అని క్యాప్షన్ పెట్టారు ఆనంద్ మెహతా. ‘మీరు 186 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఎల్బీ స్టేడియం నుంచి 10 నెలల నా మేనల్లుడు’ అంటూ హ్యాష్ ట్యాగ్స్ రూపంలో చెప్పాడు.
Never too young for ??!!
Thank you for sharing such beautiful pictures.
I wish all the very best to 10-month old Shresth and his family. https://t.co/tKWfCw1C95— Sachin Tendulkar (@sachin_rt) February 28, 2020
చిన్నారికి సచిన్ ఆశీస్సులు
ఆనంద్ మెహతా చేసిన ఆ ట్వీట్ వైరల్ కావడంతో సచిన్ చూసి స్పందించారు. పసితనంలోనే బ్యాట్ పట్టి.. తల్లితో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేసిన లిటిల్ మాస్టర్ ఈ చిన్నారిని చూసి ఫిదా అయ్యారు. క్రికెట్‌కి ఇది మరీ చిన్న వయసు అని పేరు పెట్టడానికి లేదంటూ ఆ పది నెలల పసివాడిని ఆశీర్వదించారు. ఇంతటి అందమైన ఫొటోలు షేర్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతూ ఆ చిన్నారికి, వాడి ఫ్యామిలీకి బెస్ట్ విషెస్ చెప్పారు. ఆనంద్ మెహతా పోస్ట్‌ను సచిన్ రీట్వీట్ చేయడంతో అది ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిని 38 వేల మంది లైక్, 2200 మంది రీట్వీట్ చేశారు. నెటిజన్లు ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ‘ఈ ట్వీట్‌ను మీరు షేర్ చేయడం మాకు దక్కిన గౌరవం’ అంటూ చింతన్ మెహతా.. సచిన్‌కు థ్యాంక్స్ చెప్పాడు. అలాగే మరికొందరు నెటిజన్లు ‘షేర్ చేసినందుకు థ్యాంక్స్.. లవ్ యూ’ అంటూ కామెంట్లు చేశారు. క్రికెట్ గాడ్, ఎమోషన్ ఆఫ్ ది కంట్రీ అంటూ చాలా మంది ట్వీట్లు చేశారు. ఈ బుడ్డోడు చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ మరికొందరు ట్వీట్ చేరారు.
Thank you very much for sharing this. We are truly honoured.
— chintan mehta (@chintanmehta12) February 28, 2020