బాలికల విద్య కోసం మోడీ కీలక నిర్ణయం

బాలికల విద్య కోసం మోడీ కీలక నిర్ణయం

ఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పీఎం మోడీ బాలికలకు శుభవార్త చెప్పారు. ఎర్రకోటలో జెండా ఎగురవేసిన అనంతరం జాతినుద్దేశించి ఆయన మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం 33 సైనిక్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో బాలురకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. బాలికలు సైనిక్ స్కూళ్లలో చేరడానికి అనుమతిలేదు. అయితే ఈ విషయంలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పీఎం మోడీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్లలో బాలికలకు కూడా ప్రవేశం కల్పించబడుతుందని ఆయన ప్రకటించారు. ఈ విధానం రెండున్నర సంవత్సరాల క్రితం తొలి ప్రయోగంగా మిజోరంలో ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. అది సక్సెస్ కావడంతో.. దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.

సైనిక్ పాఠశాలలను సైనిక్ స్కూల్స్ సొసైటీ నిర్వహిస్తుంది. ఈ సొసైటీ రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉంది. చిన్న వయస్సులోనే విద్యార్థులను భారత సాయుధ దళాలలో చేరేలా చేయడమే సైనిక్ స్కూల్స్ యొక్క లక్ష్యం .