‘టైగర్-3’లో సల్మాన్ కొత్త లుక్ ఇదే

‘టైగర్-3’లో సల్మాన్ కొత్త లుక్ ఇదే

బాలీవుడ్  స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న టైగర్ -3 సినిమా కొత్త లుక్ లీక్ అయింది. సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు గత వారం రష్యాకు బయలుదేరి వెళ్లారు. దర్శకుడు మనీష్ శర్మ దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. టైగర్ -3 ప్రాజెక్టు గురించి డైరెక్టర్ మరియు  ప్రొడక్షన్ టీమ్  ఎంతో గోప్యంగా ఉంచినప్పటికీ రష్యా రాజధాని మాస్కో నగర  వీధుల్లో సల్మాన్ కొత్త గెటప్ లో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియాలో సల్మాన్ అభిమానులు షేర్ చేస్తున్న ఫోటోల్లో సల్మాన్ ఖాన్ గుర్తుపట్టని విధంగా కనిపిస్తున్నాడు. సాధారణంగా హీరో వైట్ టీ, బ్లూ డెనిమ్ మరియు మెరూన్ జాకెట్‌లో కనిపిస్తాడు, కానీ ఈ సినిమాలో సల్మాన్ బంగారు మరియు గోధుమ గడ్డం, అదే కలర్ జుట్టుతో చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు. సోహైల్ ఖాన్ కొడుకు నిర్వాన్ కూడా సెట్స్ లో సల్మాన్ తోపాటు నిలబడి ఉన్న ఫోటోల్లో కనిపించాడు. హీరోయిన్ కత్రినా కైఫ్ మాత్రం షూటింగ్ ప్రదేశంలో ఎక్కడా ఉన్నట్లు కనిపించలేదు. 
'టైగర్ 3' లో సల్మాన్ ఖాన్, హీరోయిన్  కత్రినా కైఫ్ , ఇమ్రాన్ హష్మీలపై ఊపిరి పీల్చుకోవడం, కను రెప్ప వేయడం మరచిపోయే రీతిలో భారీ యాక్షన్ సన్నివేశాలను రష్యాలో చిత్రీకరిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ కొత్త లుక్ ఎంత రఫ్ గా ఉందో కింద ఫోటోలో మీరే చూడండి..