ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి

ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి

మేడ్చల్  : ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు జాతీయ యువజన అవార్డు గ్రహితల సంఘం అధ్యక్షులు సామల వేణు . కీసర మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలోని  కేఆర్ కే రెడ్డి కాలేజీలో  నిర్వహించిన పట్టా భద్రుల ఓటరు నమోదు  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సామల వేణు హాజరయ్యారు. కేఆర్ కే రెడ్డి కాలేజీలో 2017 సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులతో ఎమ్మెల్సీ ఓటరు నమోదు పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ  నమోదు చేసుకోవాలన్నారు.  హైదరాబాద్,రంగారెడ్డి,మహబూబ్ నగర్ ..నల్లగొండ,ఖమ్మం,వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల కొరకు అర్హులైన పట్టభద్రులు అక్టోబర్ 1 నుండి నవంబర్ 6  వరకు నమోదు చేసుకోవాలన్నారు.

సంబంధిత జిల్లాలోని గ్రాడ్యుయేట్లు 2017 , అక్టోబర్ 31 వ తేది వరకు బ్యాచిలర్ , డిప్లొమా డిగ్రీ పట్టా పొందినవారు బాధ్యతతో ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.జాతీయ యువజన అవార్డు గ్రహీతల సంఘం పక్షాన సామాజికపరమైన బాధ్యతతో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కోసం ప్రణాళికతో అవగాహన , ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వేణు తెలిపారు.చట్టాలను రూపొందించే చట్టసభలకు సామాజిక అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి , సమర్థవంతమైన ప్రతినిధులను పంపించే అవకాశం ఓటు ద్వారానే ఉంటుందన్నారు.పట్టభద్రులైన యువకులు ఓటర్లుగా నమోదై , ఓటును సద్వినియోగ పరచుకునప్పుడే తెలంగాణ యువత భవిష్యత్ కలలు సాకారం అవుతాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అర్హులైన వారు పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.పట్టభద్రుల ఓటరు నమోదుకు సంబంధించిన ఆన్ లైన్ లో ,ఆఫ్లైన్ లో ఫారం -18 లో ఓటు నమోదు చేసుకోవాలన్నారు.