
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న కంగనా రనౌత్.. తాజాగా సినీ ఇండస్ట్రీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమె ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. తాను ఎంపీగా గెలిస్తే ఇకపై సినిమాలకు గుడ్ బై చెబుతానంది. అంతటితో ఆగకుండా సినీ ఇండస్ట్రీ అంతా ఫేక్ అని, కనిపించేంత అందంగా ఉండదని చెప్పుకొచ్చింది.
పైగా తనకు ఒకే పని ఎక్కువ కాలం చేయాలనిపించదని, అందుకే హీరోయిన్‌గా బోర్ కొట్టినప్పుడు కథలు రాస్తానని, డైరెక్టర్‌గా, నిర్మాతగా చేస్తుంటానని అంది. ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ఉండే కంగనా రనౌత్ కామెంట్స్ ఎలాంటి చర్చలకు దారితీస్తాయో చూడాలి. ఇదిలా ఉంటే కంగనా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం త్వరలో విడుదల కానుంది.
దేశ చరిత్రలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఆమె దీన్ని రూపొందించింది. ఇందులో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా కనిపించనుంది. అలాగే హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌లో ఆమె నటిస్తోంది.