టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్. వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటై నేటికి ( ఫిబ్రవరి 10, 2026 ) సరిగ్గా 21 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ వివాహ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని సోషల్ మీడియాలో నమత్ర షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్ .
ఎప్పటికీ మధురమే!
తమ 21 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా నమత్రగా తన ఇన్ స్టాగ్రామ్ లో మహేష్ బాబుతో దిగిన ఒక క్యూట్ ఫోటోను షేర్ చేసింది. 'ఇప్పటికీ ప్రతి రోజూ నిన్నే ఎంచుకుంటున్నాను. హ్యాపీ 21MB' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు. గతంలో ఒక విమానంతో దిగిన ఈ ఫోటోలో వీరిద్దరూ చిరునవ్వుతో ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. మహేష్ బాబు కూడా ఈ ఫోటోను తన స్టోరీలో షేర్ చేసుకుని తన ప్రేమను చాటుకున్నారు. వీరిద్దరి ప్రేమకథ 2000 సంవత్సరంలో 'వంశీ' సినిమా సెట్స్‌లో మొదలైంది. ఫిబ్రవరి 10, 2005న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
ప్రియాంక చోప్రా స్పెషల్ రియాక్షన్
నమత్ర షేర్ చేసిన ఈ పోస్ట్‌పై గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా స్పందించారు. హార్ట్ ఎమోజీలు, ఫైర్ ఎమోజీలతో తన శుభాకాంక్షలు తెలిపింది. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో.. ఆఫ్-స్క్రీన్ బాండింగ్ కూడా అంతే బాగుందని ఈ కామెంట్ రూపంలో చెప్పేసింది . ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజమౌళి 'వారణాసి' అప్డేట్స్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంతో తెరకెక్కిస్తున్న ' వారణాసి ' మూవీలో రుద్రగా మహేష్ బాబు, మందాకినిగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో మెరవనున్నారు. గతేడాది విడుదలైన టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు స్థాయికి తీసుకెళ్లాయి. ఈ భారీ బడ్జెట్ అడ్వెంచర్ డ్రామా ఏప్రిల్ 7, 2027న థియేటర్లలోకి రానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
