
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న అమౌంట్‌ను రూ.43 వేల కోట్లకు టాటా మోటార్స్ పెంచింది. కొత్త ప్రొడక్ట్‌లు, టెక్నాలజీని తీసుకొచ్చేందుకు ఈ ఫండ్స్ వాడనుంది. ఇందులో మెజార్టీ ఫండ్స్ కంపెనీ సబ్సిడరీ జాగ్వర్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) ఇన్వెస్ట్ చేయనుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ గ్రూప్ జేఎల్‌ఆర్ పెట్టుబడుల కోసం రూ.30 వేల కోట్లు, టాటా మోటార్స్ కోసం రూ.8 వేల కోట్లు కేటాయించాలని ప్లాన్ చేసింది.
వీటి మొత్తం విలువ రూ.38 వేల కోట్లు. కానీ, జేఎల్‌ఆర్ రూ.33 వేల కోట్లు, టాటా మోటార్స్ రూ.8,200 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. దీంతో కిందటి ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ గ్రూప్ చేసిన పెట్టుబడులు రూ.41,200 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జేఎల్ఆర్ రూ.35 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందని, వచ్చే ఏడాది కొత్త ప్రొడక్ట్‌లను లాంచ్ చేయాలని చూస్తున్నామని టాటా మోటార్స్ గ్రూప్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8,000 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందని తెలిపింది.