నాగచైతన్య మూవీలో సమంత!

నాగచైతన్య మూవీలో సమంత!

శ్రీదేవి, జయప్రదల తర్వాత సౌత్‌‌ నుంచి వెళ్లి నార్త్‌‌లో స్టార్స్‌‌ అయినవాళ్లు లేరు. మళ్లీ ఇన్నాళ్లకి రష్మిక, సమంత లాంటివాళ్లు సెన్సేషన్‌‌ క్రియేట్‌‌ చేస్తున్నారు. ఆల్రెడీ రష్మిక రెండు సినిమాలు చేస్తోంది. రణ్‌‌బీర్‌‌‌‌ కపూర్‌‌‌‌తో ‘యానిమల్‌‌’లో నటించనుందంటూ నిన్న అనౌన్స్‌‌మెంట్ వచ్చింది. ఇక సమంత స్పీడ్‌‌ మరో రేంజ్‌‌లో ఉంది. ఓవైపు వెబ్ సిరీసులు, మరోవైపు సినిమాలు, మధ్యలో యాడ్స్.. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే సౌత్‌‌లో స్టార్‌‌‌‌ హీరోయిన్‌‌గా వెలుగుతున్న సమంత.. ‘ఫ్యామిలీ మేన్‌‌ 2’తో నార్త్‌‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో వెబ్‌‌ సిరీస్‌‌కి కమిటయ్యింది. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా చేయనుంది. అయితే ఇప్పుడు ఓ స్టార్‌‌‌‌ హీరోకి జంటగా నటించే చాన్స్ కొట్టేసినట్లు తెలిసింది. ఆ హీరో ఎవరో కాదు.. అక్షయ్ కుమార్. త్రీ ఖాన్స్‌‌ హవాని తగ్గించి బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలుకొట్టిన అక్కీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో అందరికీ తెలిసిందే. అలాంటి స్టార్‌‌‌‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది సమంత. కుమార్ మంగత్‌‌ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ అనౌన్స్‌‌మెంట్‌‌ త్వరలో రానుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక తమిళంలో ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ తెలుగులో ‘శాకుంతలమ్‌‌’ పూర్తి చేసిన సామ్, ప్రస్తుతం ‘యశోద’లో నటిస్తోంది. ఆ తర్వాత ఇంగ్లిష్ మూవీ ‘ద అరేంజ్‌‌మెంట్స్ ఆఫ్‌‌ లవ్‌‌’ చేయనుంది. త్వరలో విజయ్‌‌ దేవరకొండతో కలిసి నటించనుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నాగచైతన్యతోనూ కలిసి యాక్ట్ చేయబోతోందని ప్రచారం జరుగుతోంది. చైతు హీరోగా నందినీరెడ్డి డైరెక్షన్‌‌లో ఓ సినిమా రానుంది. దీనిలో హీరోయిన్‌‌గా సమంతను తీసుకోవాలని నందిని అనుకుంటున్నారట. నందిని, సమంత ‘ఓ బేబీ’ మూవీకి కలిసి పని చేశారు. మంచి ఫ్రెండ్స్ కూడా. కాబట్టి నందిని నిజంగా ట్రై చేస్తే సామ్ ఒప్పుకోవచ్చు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది అఫీషియల్‌‌గా అనౌన్స్ చేస్తే కానీ తెలియదు. మొత్తానికి ఎవరూ ఊహించని అవకాశాలు అందిపుచ్చుకుంటున్న సామ్‌‌ని చూసి లక్కీ గాళ్ అంటున్నారంతా.