IPL 2026: ఉత్కంఠ పోరులో గుజరాత్పై పంజాబ్ ఘన విజయం

IPL 2026: ఉత్కంఠ పోరులో గుజరాత్పై పంజాబ్ ఘన విజయం

IPL 2026: ఐపీఎల్ 2026 నాలుగో మ్యాచ్‌లో- గుజరాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్ పోటీ పడింది. న్యూ చంఢీఘడ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచులో పంజాబ్ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ తీసుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్  టైటాన్స్ పరుగులు చేసేందుకు తీవ్రంగా శ్రమించింది. 37 పరుగులు వద్ద సాయి సుదర్శన్ (13), 76 రన్స్ వద్ద గిల్ (39) ఔట్ కావడంతో గుజరాత్ ఇబ్బందుల్లో పడింది. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ కాసేపు బ్యాట్ పరుగులు రాబట్టిన భారీ స్కోర్ గా మలచడంలో విఫలమయ్యారు. బట్లర్, ఫిలిప్స్ వెంటవెంటనే పెవిలియన్ కి చేరడంతో 6 వికెట్ల నష్టానికి కేవలం 162 పరుగులు మాత్రమే చేసింది.

ఇక 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు ఓపెనర్ ప్రియాంష్ ఆర్య తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి కగిసో రబాడ బౌలింగ్ లో అశోక్ శర్మకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్  ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (24 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులతో 37 పరుగులు)తో రషీద్ ఖాన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి ప్రసిద్ కృష్ణకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి వెళ్లిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చినకూపర్ కొన్నోలీ ( 44 బంతుల్లో 5  ఫోర్లు 5 సిక్సులతో 72 పరుగులు ) అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టుకి విజయాన్ని అందించాడు. 

ఈ మ్యాచులో చిన్న గందరగోళం ఏర్పడింది. రషీద్ ఖాన్ వేసి11. 5 బంతికి కూపర్ కానలీ కొట్టిన బంతి సరిగ్గా శ్రేయస్ అయ్యర్ కుడి చేతి మణికట్టుకు తగిలింది. దీంతో గ్రౌండ్ లోనే అతడు గిలగిల కొట్టుకోవడంతో..  ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో అతడిని ఫిజియో పరీక్షించిన తర్వాత గాయపడిన ప్రదేశంపై ఐస్ ప్యాక్ పెట్టడంతో తిరిగి బ్యాటింగ్ ప్రారంభించిన అయ్యర్ (18) కాసేపటికే  ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్ కి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి వెళ్లిపోయాడు.

శ్రేయస్ అయ్యర్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన నెహల్ వధేరా (3), శాశంక్ సింగ్ (4), మార్కస్ స్టోయినిస్ (0), మార్కో యాన్సెన్ (9) ఘోరంగా విఫలం అయ్యారు. చివర్లో కూపర్ కొన్నోలికి తోడుగా జేవియర్ బార్ట్‌లెట్ ( 5 బంతుల్లో 1 సిక్సుతో 11 పరుగులు) చెలరేగాడంతోనే చివరకి విజయం పంజబ్ కింగ్స్ జట్టునే వరించింది.  ఇక గుజరాత్ టైటాన్స్ తరపున ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ప్రసిద్ కృష్ణ ఈ మ్యాచులో తన ఇంపాక్ట్ చూపించాడు 4 ఓవర్లు వేసి 29  పరుగులు ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు తీసుకోగా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, కగిసో రబాడా, అశోక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.