హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి మృతి చెందాడు. అతను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న ఫ్లాట్లోని ఓ యువతిపై అత్యాచార యత్నం చేశాడు. యువతి కేకలు వేయడంతో పక్క ఫ్లాట్లో ఉన్న వ్యక్తులు వచ్చి అతనిపై దాడి చేశారు. దాడిలో రామ్మోహన్ (40) తలకు తీవ్ర గాయమైంది.
హాస్పిటల్కు తరలించడంతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు.
