సమంత నయా ప్లాన్స్ ...

సమంత నయా ప్లాన్స్ ...

ఓవైపు సమంత పర్సనల్‌‌ లైఫ్‌‌కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఆమె కొత్త ప్రాజెక్ట్స్​కి సంబంధించిన వార్తలు కూడా బైటికొస్తున్నాయి. రీసెంట్‌‌గా ‘శాకుంతలమ్‌‌’ షూట్‌‌ను కంప్లీట్ చేసిన సామ్.. ప్రస్తుతం విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ షూట్‌‌లో పాల్గొంటోంది. త్వరలో మరో కొత్త సినిమాని స్టార్ట్ చేయనున్నట్టు తెలిసింది. ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన కథకి ఇంప్రెస్ అయిన సమంత వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించే ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీని నవంబర్‌‌‌‌లో స్టార్ట్ చేయడానికి ముహూర్తం కూడా పెట్టేశారని, త్వరలోనే అనౌన్స్‌‌మెంట్‌‌ రానుందని సమాచారం. మరోవైపు నెట్‌‌ఫ్లిక్స్‌‌ కోసం ఓ వెబ్‌‌ సిరీస్ చేయడానికి కూడా సమంత ఓకే చెప్పిందని అంటున్నారు. నిర్మాతగా కొన్ని డిజిటల్ ప్రాజెక్టులు చేపట్టే ఆలోచనలో కూడా ఉందని టాక్. మరి వీటిలో ఎంత నిజముందో అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్స్ వస్తే కానీ చెప్పలేం. కాకపోతే ఏం చేసినా పక్కా ప్లానింగ్‌‌తో చేస్తుంది కాబట్టి సమంత కమిటయ్యే ప్రాజెక్ట్స్‌‌పై తమ అంచనాలు ఎప్పుడూ భారీగానే ఉంటాయంటున్నారు ఫ్యాన్స్.