V6 News

సిక్సర్ల మోత.. సంజు శాంసన్ అదరగొట్టాడు

సిక్సర్ల మోత.. సంజు శాంసన్ అదరగొట్టాడు

షార్జా: ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కి చుక్కలు చూపించాడు యంగ్ క్రికెటర్ సంజు శాంసన్. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న రాజస్థాన్.. దూకుడుగా ఆడుతుంది. ప్రారంభంలోనే వికెట్ పోయినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన సంజు వరుస సిక్సర్లు, బౌండరీలతో అదరగొట్టాడు. ఊహించని స్టైల్లో సిక్సర్లు బాదుతూ.. 19 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేసి, 9 ఓవర్లలోనే జట్లుకు 100 రన్స్ అందించాడు. ఆ తర్వాత 12 వ ఓవర్ లో సంజు శాంస్ (74) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిల్లర్ (0)రన్ ఔట్ అయ్యాడు. దీంతో  12 ఓవర్లు ముగిసేసమయానికి 3 వికెట్లు కోల్పోయిన రాయల్స్ 134 రన్స్ చేసింది.