మరో 3 కంపెనీ ఐపీఓలకు ఓకే

మరో 3 కంపెనీ ఐపీఓలకు ఓకే

న్యూఢిల్లీ: సెబీ మరో మూడు కంపెనీల ఐపీఓలకు పచ్చజెండా ఊపింది. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఫార్మసీ ఫార్మ్​ ఈజీ (పేరెంట్ కంపెనీ ఏపీఐ హోల్డింగ్స్ లిమిటెడ్​), వెల్‌‌‌‌నెస్ ఫరెవర్ మెడికేర్ లిమిటెడ్,  సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ లిమిటెడ్,  ఇష్యూలకు సెబీ ఓకే చెప్పింది. ఏపీఐ హోల్డింగ్స్ ఐపీఓ ద్వారా రూ. 6,250 కోట్లను సేకరించడానికి నవంబర్ 2021లో సెబీకి డ్రాఫ్ట్ పేపర్‌‌‌‌లను దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయం అప్పును తిరిగి చెల్లించడానికి, కొత్త కొనుగోళ్ల కోసం ఖర్చు చేస్తారు. అయితే కంపెనీ ఫౌండర్లు, ఇన్వెస్టర్లు ఐపీఓలో వాటాలను అమ్మడం లేదు. ఫ్రెష్ ఇష్యూ మాత్రమే ఉంటుంది.  ఏపీఐ హోల్డింగ్స్ ప్రైవేట్ ప్లేస్‌‌‌‌మెంట్ ద్వారా రూ. 1,250 కోట్ల వరకు ప్రీ-ఐపిఓ ఫండ్స్​ను సేకరించనుంది. వెల్నెస్ ఫరెవర్ మెడికేర్ లిమిటెడ్, అదర్ పూనావాలా ఇన్వెస్ట్​మెంట్లు ఉన్న ఫార్మసీ చైన్ గత అక్టోబరులో ఐపీఓ కోసం డ్రాఫ్ట్ పేపర్‌‌‌‌లను దాఖలు చేసింది. దీని ప్రముఖ వాటాదారు సీరమ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తన షేర్లలో ఎక్కువ భాగాన్ని అమ్మనుంది. ఐపీఓలో రూ. 400 కోట్ల తాజా ఇష్యూ ఉంటుంది. ప్రస్తుత షేర్‌‌‌‌హోల్డర్లు  ప్రమోటర్ల నుండి 1.6 కోట్ల షేర్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది. వెల్‌‌‌‌నెస్ ఫరెవర్‌‌‌‌ను 2008లో అష్రఫ్ బిరాన్, గుల్షన్ బఖ్తియాని  మోహన్ చవాన్ స్థాపించారు. బిరాన్,  భక్తియాని ఒక్కొక్కరు 7,20,000 షేర్ల చొప్పున అమ్ముతున్నారు, చవాన్ దాదాపు 1.2 మిలియన్ షేర్లను అమ్ముతున్నారు.ఇష్యూ తర్వాత, వెల్‌‌‌‌నెస్ ఫరెవర్‌‌‌‌లో ఎస్ఐఐకి కేవలం 40,000 షేర్లు మాత్రమే ఉంటాయి. ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని మూలధన వ్యయం, కొత్త స్టోర్ల ఏర్పాటు, లోన్ల చెల్లింపు,  వర్కింగ్ క్యాపిటల్ నిధుల కోసం ఉపయోగిస్తారు. దేశీయ అల్యూమినియం రీసైక్లింగ్ ఇండస్ట్రీలో ఒకటైన సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ కోసం సెప్టెంబర్ 2021లో సెబీకి డ్రాఫ్ట్ పేపర్‌‌‌‌లను అందజేసింది. ఐపీఓలో రూ. 300 కోట్ల ఫ్రెష్ ఇష్యూ ఉంటుంది. ప్రమోటర్ల ద్వారా 3.34 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది.

బికాజీ ఫుడ్స్ కూడా..

స్నాక్స్  స్వీట్ల తయారీ కంపెనీ బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్, రూ. 1,000 కోట్ల విలువైన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కోసం సెబీకి డాక్యుమెంట్లు అందజేసింది.  ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా దాదాపు 2.94 కోట్ల షేర్లను అమ్ముతారు. ప్రైస్ బ్యాండ్ రూ.300–రూ.325 మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. బికాజీ 2021 ఆర్థిక సంవత్సరంలో 26,690 టన్నుల  ఉత్పత్తి సాధించింది. ఇది పాక్డ్ రసగుల్లా, సోన్ పాప్డి  గులాబ్ జామూన్‌‌ల వంటి 250 రకాల ప్రొడక్టులను అమ్ముతుంది.  ఈ లిస్టింగ్  బ్రాండ్ ఇమేజ్‌‌ను మెరుగుపరుస్తుందని కంపెనీ ఆశిస్తోంది. జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఇంటెన్సివ్ ఫిస్కల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్  కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లు.