- 400 గ్రాముల ఓపీఎం, 450 గ్రాముల పాపీ స్ట్రా స్వాధీనం
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డీపీఈఓ సికింద్రాబాద్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన డీటీఎఫ్ బృందం ప్రత్యేకంగా రూట్‌వాచ్ నిర్వహించింది.
ఈ క్రమంలో న్యూ బోయిన్‌పల్లిలోని రివేరా వైన్స్ ఎదురుగా అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులపై నిఘా పెట్టి తనిఖీలు చేపట్టారు. సోదాల్లో నిందితుల నుంచి 400 గ్రాముల ఓపీఎంతో పాటు 450 గ్రాముల పాపీ స్ట్రాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన పవన్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు హరీశ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. స్కూటీ, ఫోన్‌ను సీజ్ చేశారు.
