సికింద్రాబాద్-కాకినాడకు 10 స్పెషల్ ట్రైన్స్

సికింద్రాబాద్-కాకినాడకు 10 స్పెషల్ ట్రైన్స్

ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ నుంచి కాకినాడటౌన్‌ కు పది స్పెషల్ ట్రైన్స్ నడుపనున్నట్టు తెలిపింది రైల్వే. సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07436) సికింద్రాబాద్‌ నుంచి 7, 9, 15, 21 తేదీల్లో రాత్రి 8 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు కాకినాడటౌన్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడటౌన్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07435) కాకినాడటౌన్‌ నుంచి 8, 10, 17, 24వ తేదీల్లో రాత్రి 10.20 గంటలకు బయల్దేరి, మరుసటి రోజ ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. హైదరాబాద్‌-కాకినాడ టౌన్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07001) హైదరాబా ద్‌ నుంచి 5వ తేదీ సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరి, మరుసటి రో జు ఉదయం 6గంటలకు కాకినాడటౌన్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్‌-హైదరాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07002) కాకినాడటౌన్‌ నుంచి 6వ తేదీ రాత్రి 9 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు హైదరాబాద్‌ చేరుతుంది.