ట్రంప్‌‌‌‌పై ట్రయల్‌‌‌‌కు సెనేట్ ఓకే

ట్రంప్‌‌‌‌పై ట్రయల్‌‌‌‌కు సెనేట్ ఓకే

ట్రయల్ కు వ్యతిరేకంగా రిపబ్లికన్ల తీర్మానం ఫెయిల్
ట్రంప్‌‌‌‌కు యాంటీగా ఓటేసిన ఆరుగురు రిపబ్లికన్లు

వాషింగ్టన్: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్​పై సెనేట్​లో బుధవారం మధ్యాహ్నం (లోకల్ టైం ప్రకారం) ఇంపీచ్​మెంట్ ట్రయల్ షురూ కానుంది. పదవి నుంచి దిగిపోయిన ప్రెసిడెంట్​ను మళ్లీ తొలగించడం ఏమిటని, దాన్ని అడ్డుకోవాలని రిపబ్లికన్లు సెనేట్​లో ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. వంద మంది సభ్యులున్న సెనేట్​లో తీర్మానానికి వ్యతిరేకంగా 56 ఓట్లు, అనుకూలంగా 44 ఓట్లు వచ్చాయి. సెనేట్​లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లకు చెరో 50 సీట్లు ఉన్నాయి. అయితే ట్రంప్ సొంత పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు కూడా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశా రు. దీంతో ట్రంప్ పై ట్రయల్​కు అడ్డంకి తొలగిపోయింది. ఈ విషయంపై మాట్లాడేందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ నిరాకరించారు.

ట్రంప్ గట్టెక్కే చాన్సే ఎక్కువ

హౌజ్ ఆఫ్​రిప్రజెంటేటివ్స్ నియమించిన ఇంపీచ్ మెంట్ మేనేజర్లు, ట్రంప్ లాయర్లు బుధవారం (అమెరికా టైమ్​)సెనేట్​లో వాదనలు వినిపిస్తారు. ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఇంపీచ్ మెంట్ పాస్ కావాలంటే సభలో మూడొంతుల సభ్యుల (67) ఓట్లు అవసరం. కానీ ట్రంప్​పై అభిశంసన తీర్మానం వీగిపోయే చాన్సే ఎక్కువగా ఉందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే, అమెరికా హిస్టరీలోనే రెండు సార్లు ఇంపీచ్ మెంట్​ను ఎదుర్కొన్న ఒకే ఒక్క ప్రెసిడెంట్​గా, పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఇంపీచ్ మెంట్​కు గురైన ఏకైక ప్రెసిడెంట్​గా ట్రంప్ ఇప్పటికే చెడ్డపేరు
మూటగట్టుకున్నారు.

లీడింగ్ గ్లోబల్ పవర్ గా ఇండియా: బైడెన్

ఇండియా లీడింగ్ గ్లోబల్ పవర్ గా ఎదగడాన్ని స్వాగతిస్తున్నామని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. ఇండో- పసిఫిక్ రీజియన్ లో భద్రతపై కీలక పాత్ర పోషిస్తున్న ఇండియా తమకు అతి ముఖ్యమైన పార్ట్ నర్ అని చెప్పారు. యూఎస్ – ఇండియా పార్ట్​నర్​షిప్​పై తమ విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్, ఇండియన్ మినిస్టర్ జైశంకర్ ఫోన్లోమాట్లాడారని, డిఫెన్స్, కౌంటర్ టెర్రరిజం, పర్యావరణం, హెల్త్, ఎడ్యుకేషన్ సహా పలు అంశాలపై చర్చించారని బైడెన్ చెప్పారు.