వాషింగ్టన్: సెరెనా విలియమ్స్ 24 వ గ్రాండ్‌స్లామ్ వేట మరికొంత కాలం కొనసాగనుంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న యూఎస్ ఓపెన్ నుంచి సెరెనా తప్పుకుంది. కుడి కాలు హ్యామ్ స్ట్రింగ్‌లో ఇంజ్యురీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నానని సెరెనా బుధవారం ప్రకటించింది. జూన్‌లో జరిగిన వింబుల్డన్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌లో గాయపడిన సెరెనా అప్పట్నించి ఆటకు దూరంగా ఉంది. మెన్స్ సింగిల్స్‌లో నడాల్, ఫెడరర్ కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు.
