ఓయూ, వెలుగు : టీఎస్‌సెట్2022 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 6నుంచి 9 వరకు ఓయూలోని పీజీఆర్ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్‌సెక్రటరీ ప్రొ. మురళీ కృష్ణ వెల్లడించారు. అభ్యర్థులకు సబ్జెక్టుల వారీగా వెరిఫికేషన్ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. టీఎస్ సెట్ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సీ, పీజీ మెమోలు, పీజీ డిగ్రీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో రావాలని వివరించారు. మరిన్ని వివరాలకు www.telanganaset.org వెబ్సైట్ చూడాలని సూచించారు.

