మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలిగా షాయరా బానో

మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలిగా షాయరా బానో

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ కు షాయరా బానో ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమె అధికార పార్టీ బీజేపీలో చేరిన 10 రోజుల్లోనే ఈ పదవిని పొందారు. ట్రిపుల్‌ తలాక్ రద్దు కోసం పోరాడిన షాయరా బానోకు ఈ పదవి దక్కడం విశేషం .  ట్రిపుల్‌ తలాక్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించినవారిలో ప్రధాన పిటిషనర్‌ షాయరా బానో. షాయరా బానో తో పాటు జ్యోతి షా, పుష్ప పాశ్వాన్‌లను రాష్ట్ర మహిళా కమిషన్‌ ఉపాధ్యక్షులుగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం  నియమించింది. మహిళల సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఈ నియామకాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌.