సిద్దిపేట సర్కారు హాస్పిటల్‌‌లో కూలిన ఐసీయూ సీలింగ్

సిద్దిపేట సర్కారు హాస్పిటల్‌‌లో కూలిన ఐసీయూ సీలింగ్

మెదక్‌‌‌‌‌‌‌‌, బోధన్‌‌‌‌‌‌‌‌ సర్కారు ఆస్పత్రుల్లో సీలింగ్‌‌‌‌‌‌‌‌ కూలిన ఘటన మరువకముందే సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగంలోని ఐసీయూ సీలింగ్‌‌‌‌‌‌‌‌ కూలింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎమర్జెన్సీ విభాగంలోని ఐసీయూ పీవోపీ సీలింగ్‌‌‌‌‌‌‌‌ తడిసి కూలింది. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లో అక్కడ రోగులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కూలిన భాగాలను ఆస్పత్రి సిబ్బంది తొలగించి విషయం బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. విష యాన్ని రోగుల సంబంధీకులు గమనించి బుధవారం మీడియాకు సమాచారం ఇచ్చారు. కూలిన సీలింగ్‌‌‌‌‌‌‌‌ ఫొటోలు తీయకుండా ఆస్పత్రి సిబ్బంది అడ్డుకున్నా రు. సీలింగ్‌‌‌‌‌‌‌‌కూలిన ఘటనపై ఆర్‌‌‌‌‌‌‌‌ఎంవో హేమలత వివరణ కోరగా మాట్లాడటానికి నిరాకరించారు. ఐసీయూ యూనిట్ శ్లాబ్‌ పై భాగంలో కొద్ది రోజులుగా వర్షపు నీరు నిలిచి కిందికి కారుతున్నట్టు తెలుస్తోంది. శ్లాబ్‌ నుంచి నీరు కిందికి కారి పీవోపీ తడిసి ఉంటుందని భావిస్తున్నారు. కూలిన సీలింగ్‌‌‌‌‌‌‌‌కు వెంటనే మరమ్మతులు చేయాలని ప్రయత్నించినా ఆస్పత్రిలో పని చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఐసీయూలో బెడ్స్‌‌‌‌‌‌‌‌ను పక్కకు జరిపి రోగులకు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.

అన్నీ ఆంధ్రా కంపెనీకే ..మెఘా దగా.!