భారతీయులు సింగపూర్ కు వెళ్లవచ్చు

భారతీయులు సింగపూర్ కు వెళ్లవచ్చు
  • భాతర ప్రయాణికులపై సింగపూర్ ఆక్షలు సడలింపు

సింగపూర్‌కు అక్టోబర్ 26 నుంచి భారత్ ప్రయాణికులను అనుమతించనున్నారు. భారత్‎తో పాటు బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక నుంచి వచ్చేవారిని కూడా అనుమతించనున్నారు. అక్టోబర్ 26 రాత్రి 11.59 గంటల నుండి సింగపూర్‌లోకి ప్రవేశించడానికి అనుమతి ఇస్తున్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ( శనివారం) ప్రకటించింది. అయితే .. ప్రయాణికులు గత 14 రోజుల్లో ఎక్కడ ఉన్నారో చెప్పాలని.. ప్రయాణికులు క్వారంటైన్ నియమాలను తప్పకుండా పాటించడంతె పాటు.. 10 రోజులు హోం క్వారంటైన్‎లో ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇంతకుముందు సింగపూర్ మరో 15 దేశాల నుండి పూర్తిగా టీకాలు వేసిన ప్రయాణికులకు అనుమతి ఇచ్చింది. వాటిలో ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. స్థానిక గృహాల్లో పని చేయడానికి టీకాలు వేయించుకున్న వారినే అనుమతించింది.  ప్రస్తుతం అమలులో ఉన్న కఠినమైన ఆంక్షలను పొడిగించారు. నవంబర్ 21, 2021 వరకు ఒక నెల పాటు పొడిగించారు. జనవరి 1, 2022 నుండి పూర్తిగా టీకాలు వేసుకున్న వారు .. గత 270 రోజులలో కోవిడ్-19 నుండి కోలుకున్న ఉద్యోగులు మాత్రమే కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. టీకా వేయించుకోని ఉద్యోగులు కోవిడ్ నెగటివ్ అని సర్టిఫికెట్ చూపించాలని స్పష్టం చేసింది సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ.