జూమ్ కాల్ ద్వారా ఉరిశిక్ష విధించిన కోర్టు

జూమ్ కాల్ ద్వారా ఉరిశిక్ష విధించిన కోర్టు

జూమ్ వీడియో కాల్ ద్వారా ఒక ముద్ధాయికి మరణశిక్షను విధించిన ఘటన సింగపూర్‌లో జరిగింది. వీడియో కాల్ ద్వారా ఒక వ్యక్తికి మరణశిక్ష విధించడం సింగపూర్‌లో ఇదే మొదటిసారి. కరోనావైరస్ నియంత్రణ కోసం సింగపూర్‌లో లాక్డౌన్ అమలులో ఉంది. అందువల్ల ఈ కేసును వీడియో కాల్ ద్వారా పరిష్కరించారు.

మలేషియాకు చెందిన 37 ఏళ్ల పునితన్ జెనాసన్ 2011లో హెరాయిన్ కేసులో అరెస్టయి జైలులో ఉన్నాడు. సింగపూర్‌లో అక్రమ మాదకద్రవ్యాలకు సంబంధించి జీరో-టాలరెన్స్ పాలసీని అమలులో ఉంది. అంతేకాకుండా.. గత దశాబ్దాలుగా మాదకద్రవ్యాల నేరాలకు సంబంధించి విదేశీయులతో సహ వందలాది మందిని సింగపూర్ ప్రభుత్వం ఉరితీసింది. ఇప్పుడు పునితన్ కేసు హియరింగ్ కు రావడంతో అతనికి కూడా ఉరిశిక్షను విధించింది.

విచారణలో పాల్గొన్న అందరి భద్రత మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ భద్రత కోసం ఈ కేసును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాం. వైరస్ ను తగ్గించడానికే ఈ మార్గాన్ని ఎన్నుకున్నట్లు సింగపూర్ సుప్రీంకోర్టు ప్రతినిధి తెలిపారు. సింగపూర్‌లో రిమోట్ హియరింగ్ ద్వారా మరణశిక్షను ప్రకటించిన మొదటి క్రిమినల్ కేసు ఇదేనని ఆయన తెలిపారు.

పునితన్ తరపు న్యాయవాది పీటర్ ఫెర్నాండో మాట్లాడుతూ.. తన క్లయింట్ జూమ్ కాల్‌ ద్వారా న్యాయమూర్తి తీర్పును అందుకున్నారని తెలిపారు. తాము చేసుకున్న అప్పీల్‌ను న్యాయమూర్తి పరిశీలిస్తున్నారని ఫెర్నాండో తెలిపారు. వీడియో కాల్ హియరింగ్ ను మేం వ్యతిరేకించలేదని ఫెర్నాండ్ చెప్పారు. ఎందుకంటే ఈ హియరింగ్ లో ఎటువంటి వాదనలు లేవని.. కేవలం తీర్పు మాత్రమే వస్తుందని ఆయన తెలిపారు.

సింగపూర్ సుప్రీంకోర్టు జూమ్ వంటి రిమోట్ టెక్నాలజీ ద్వారా ఒక వ్యక్తికి మరణశిక్షను విధించడం అమానవీయమైనది అని హ్యూమన్ రైట్స్ వాచ్ యొక్క ఆసియా విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఫిల్ రాబర్ట్‌సన్ అన్నారు. అచ్చం ఇలాగే నైజీరియాలో జూమ్ ద్వారా విధించిన మరణశిక్షను కూడా HRW విమర్శించింది.

For More News..

బారికేడ్ల వల్ల ప్రమాదం.. రూ.75 లక్షల పరిహారం చెల్లించాలన్న హైకోర్టు

గాడ్సే దేశభక్తుడే.. నేరాన్ని సమర్థించలేదు..

వీడియో: కొడుకుకు హెయిర్ కట్ చేసిన సచిన్ టెండూల్కర్

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతి