ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉంటే పబ్ కు వెళ్లా..

ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉంటే పబ్ కు వెళ్లా..

బంజారాహిల్స్  రాడిసన్ పబ్ లో  డ్రగ్స్ కేసుకు  తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు సింగర్ రాహుల్ సిప్లీగంజ్. డ్రగ్స్ గురించి తనకు ఏమీ తెలియదన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న తాను..డ్రగ్స్ ఎందుకు తీసుకుంటానన్నారు. ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉంటే పబ్ కు వెళ్లానని.. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదన్నారు. అవసరమైతే టెస్టులకు సిద్ధమన్నారు. పబ్ నుంచి బయటకు వచ్చే సమయానికి పోలీసులు వచ్చి అడ్డుకున్నారన్నారు. సమయానికి మించి పబ్స్ నడిపితే వాటి యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి కానీ..తమను ఇబ్బంది పెట్టడమేంటని ప్రశ్నించారు రాహుల్. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు వెళ్తానన్నారు. 

For more news...

బ్‎లో ప్రముఖులు.. లైవ్ అప్‎డేట్స్

డ్రగ్స్‌ వ్యవహారం.. బంజారాహిల్స్ సీఐ సస్పెన్షన్