డ్రగ్స్‌ వ్యవహారం.. బంజారాహిల్స్ సీఐ సస్పెన్షన్

డ్రగ్స్‌ వ్యవహారం.. బంజారాహిల్స్ సీఐ సస్పెన్షన్

హైదరాబాద్ : బంజారాహిల్స్ పబ్ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రముఖులు, సినీ నటులను వదిలిపెట్టడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సినీ నటి నిహారికను పోలీస్ స్టేషన్కు తీసురాకుండా బయటకు పంపించడంతో బంజారాహిల్స్ సీఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. వెంటనే నిహారికను పీఎస్కు తీసుకువచ్చి విచారించారు. అనంతరం ఆమెకు నోటీసులు ఇచ్చి పంపించారు. అలాగే పోలీసుల అదుపులో ఉన్న రాహుల్ సిప్లిగంజ్ను ప్రశ్నించిన అనంతరం నోటీసులు ఇచ్చి పంపించారు. ఈ కేసులో ఏసీపీ సుదర్శన్ కు ఛార్జ్ మెమో ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఈవెంట్ ఆర్గనైజర్స్, పబ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ఎక్కడ నుంచి తెచ్చారనే కోణంలో విచారిస్తున్నారు ఉన్నతాధికారులు. VIPలను ఎవరు కో ఆర్డినేట్ చేశారనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. పక్కా సమాచారంతో పబ్పై పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తోంది.