‘వలస కూలీలు తిరిగి పని ప్రాంతాలకు వెళ్లాలి’

‘వలస కూలీలు తిరిగి పని ప్రాంతాలకు వెళ్లాలి’

రాంచీ: దేశ ఎకానమీని పరిగెత్తించాల్సిన అవసరం దృష్ట్యా టాలెంటెడ్ మైగ్రంట్ వర్కర్స్‌ తిరిగి తమ వర్క్ ప్లేసెస్‌కు వెళ్లి త్వరగా పనులు ప్రారంభించాలని జార్ఖండ్ ఆర్థిక మంత్రి రామేశ్వర్ ఒరాన్ చెప్పారు. ‘స్కిల్డ్ వర్కర్స్‌కు బిగ్ సిటీస్ అనుకూలంగా ఉంటాయి. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే.. లాక్‌డౌన్ కారణంగా ఎవరైతే తమ ఇళ్లకు తిరిగి వచ్చారో వారు మళ్లీ తమ పని ప్రాంతాలకు వెళ్లాలి. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడంలో తమ వంతుగా తోడ్పడాలి’ అని రామేశ్వర్ పేర్కొన్నారు. వలస కూలీలు పని లేకుండా ఇళ్ల వద్దే కూర్చోవద్దని ఆయన నొక్కి చెప్పారు. నరేగా కింద సాధ్యమైనంత పని దినాలను పెంచాలని తమపై ఒత్తిడి ఉందన్నారు. లాక్‌డౌన్ సమయంలో జార్ఖండ్‌కు సుమారు 5 లక్షల మంది తిరిగొచ్చారు.