ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో దారుణం జరిగింది. ఓ లేడీస్ హాస్టల్లో గదిలోకి వెళ్లి ఇద్దరు అమ్మాయిలపై కిరాతకంగా దాడి చేశాడు హాస్టల్ ఓనర్ కొడుకు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. అది ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోని శంకర్ ఘాట్ లో ఉన్న ఓ లేడీస్ హాస్టల్. సదరు హాస్టల్ ఓనర్ కొడుకు ఇద్దరు అమ్మాయిలపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో నిందితుడు ఇద్దరు అమ్మాయిలను కొడుతూ.. వారిలో ఒకరి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్తుండగా... ఒక వృద్ధురాలు ఆపుతోంది. హాస్టల్ యజమాని కొడుకు తమను వేధిస్తున్నాడని, తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అంటున్నారు అమ్మాయిలు. మే 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
In Prayagraj, son of a girls’ lodge owner allegedly harassed two female students (competitive exam prep) with calls & messages, then beat them after they protested. FIR filed, accused arrested & later bailed. Video of the scuffle viral. pic.twitter.com/dXXKdfNMui
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 21, 2026
నిందితుడు తమ గదిలోకి వచ్చేందుకు ప్రయత్నించిన క్రమంలో అడ్డుకున్నామని.. దీంతో అతడు తమపై దాడికి పాల్పడ్డాడని అంటున్నారు బాధిత అమ్మాయిలు. హాస్టల్ ఓనర్ కొడుకు మద్యం మత్తులో ఉన్నాడని... తరచూ ఫోన్ కాల్స్ మెసేజ్ లు చేస్తుంటాడని అంటున్నారు అమ్మాయిలు. అతని కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతో రూమ్ దగ్గరికి వచ్చి తలుపు బాదడం మొదలుపెట్టాడని అంటున్నారు.
అమ్మాయిలు తలుపు తీయకపోవడంతో గది బయట తాళం వేశాడని అంటున్నారు అమ్మాయిలు.ఆ సమయంలో గట్టిగా కేకలు వేసినా తలుపు తీయలేదని.. ఈలోపు అతని తల్లి అక్కడికి చేరుకోవడంతో తలుపు తీసి లోపలి వచ్చి తమను దూషించి దాడి చేశాడని అంటున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు.
