స్మార్ట్​ఫోన్ల జోరు తగ్గలే

స్మార్ట్​ఫోన్ల జోరు తగ్గలే

8 శాతం పెరిగినయ్​

న్యూఢిల్లీ: ఇండియన్‌‌ స్మార్ట్‌‌ఫోన్‌‌ మార్కెట్‌‌ 2019 లో  ఎనిమిది శాతం పెరిగిందని ఐడీసీ(ఇంటర్నేషనల్‌‌ డేటా కార్పొరేషన్‌‌) డేటా పేర్కొంది. గత ఏడాది  15.25 కోట్ల యూనిట్ల స్మార్ట్‌‌ఫోన్‌‌  షిప్‌‌మెంట్‌‌ జరిగిందని తెలిపింది. దీంతో గ్లోబల్‌‌గా చైనా తర్వాత రెండవ అతిపెద్ద మార్కెట్‌‌గా ఇండియా ఎదిగిందని  పేర్కొంది. 2020 లో ఇండియన్‌‌ స్మార్ట్‌‌ఫోన్‌‌ మార్కెట్‌‌ గ్రోత్‌‌ సింగిల్‌‌ డిజిట్‌‌గానే ఉండొచ్చని  అంచనా వేసింది. ఇండియన్‌‌ స్మార్ట్‌‌ఫోన్‌‌ మార్కెట్‌‌లో షావోమి లీడర్‌‌‌‌గా ఉందని ఐడీసీ డేటా పేర్కొంది. 2019 లో ఈ కంపెనీ 4.36  కోట్ల యూనిట్లను షిప్‌‌ చేసిందని తెలిపింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో షావోమి(28.6 శాతం మార్కెట్‌‌వాటా)  మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత శామ్‌‌సంగ్‌‌(20.3 శాతం), వివో(15.6 శాతం), ఒప్పో(10.7 శాతం), రియల్‌‌మీ(10.6 శాతం)  తర్వాతి స్థానాలలో ఉన్నాయి.  డిసెంబర్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌లో 3.69 కోట్ల యూనిట్ల స్మార్ట్‌‌ఫోన్ల షిప్‌‌మెంట్‌‌ జరిగిందని ఐడీసీ పేర్కొంది. ఇది ఏడాది ప్రాతిపదికన 5.5 శాతం ఎక్కువని, కానీ క్వార్టర్‌‌‌‌ ప్రాతిపదికన చూస్తే 20.8 శాతం పడిపోయింది.