సోదరా.. అన్నదమ్ముల అనుబంధం

సోదరా.. అన్నదమ్ముల అనుబంధం

సంపూర్ణేష్ బాబు, సంజోష్ లీడ్ రోల్స్‌‌లో మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో  క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మాంక్ ఫిలిమ్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రం ‘సోదరా’. అన్నదమ్ముల అనుబంధం గురించి తెలియజేసేలా దీన్ని రూపొందిస్తున్నారు.  

ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను అక్టోబర్ 29న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత చంద్ర మాట్లాడుతూ ‘అన్నయ్య, సీతారామరాజు, తమ్ముడు వంటి ఎన్నో సినిమాలు అన్నదమ్ముల బంధాన్ని తెలియజేసేలా వచ్చాయి. ఆ కోవలోకే మా సోదరా సినిమా కూడా వస్తుంది’ అని అన్నారు. బాబు మోహన్, గెటప్ శ్రీను, బాబా భాస్కర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సునీల్ కశ్య ప్ సంగీతం అందిస్తున్నాడు.