భూమిని తాకిన సోలార్ ​రేడియేషన్​

భూమిని తాకిన సోలార్ ​రేడియేషన్​

వాషింగ్టన్: సూర్యుడి నుంచి విడుదలైన సోలార్​ రేడియేషన్​ ఆదివారం భూమిని తాకింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆకాశంలో వింతైన కాంతులు(అరోరాస్) కనిపించాయి. సోలార్​ ఫ్లేర్స్ లలోని ఆవేశ కణాలు(చార్జ్డ్​పార్టికల్స్) భూమి వైపు వచ్చి భూ అయస్కాంత క్షేత్రంతో చర్య జరపడంతో ఇలా రంగురంగుల కాంతులు ఏర్పడ్డాయి. మామూలుగా అరోరాస్​ఏర్పడాల్సిన ఎత్తు కన్నా ఈసారి తక్కువ ఎత్తులో కనిపించాయి. ఇలాంటి సోలార్​ఫ్లేర్స్​భూమిని తాకినప్పుడు స్పేస్​లో, భూమిపై ఉన్న టెక్నాలజీ వస్తువులకు డ్యామేజ్​జరుగుతుంటుందని, అయితే ప్రస్తుత ఫ్లేర్స్ వల్ల జరిగే నష్టం చాలా తక్కువేనని అమెరికా స్పేస్​వెదర్​ ప్రెడిక్షన్​సెంటర్​ వెల్లడించింది. అరోరాస్​ఎక్కువగా ఉత్తర ధృవంలో ఏర్పడుతుంటాయని, అయితే ఈ ఫ్లేర్స్​ వల్ల కాస్త దూరంగా జరిగి ఈశాన్య ప్రాంతంలో ఏర్పడొచ్చని వివరించింది.

సూర్యునిలో భయంకర పేలుళ్లు

సూర్యుని ఎడమ భాగంలో యాక్టివ్​గా ఉన్న  ప్రాంతంలో ఈ అక్టోబర్​ 25, 26 మధ్య పెద్ద పేలుళ్లను.. వాటి వల్ల బయటకు వచ్చిన కాంతులను గుర్తించామని నాసా తెలిపింది. ఇందుకు సంబంధించి సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ద్వారా తీసిన వీడియో ఫుటేజ్​ను విడుదల చేసింది. పేలుళ్ల తర్వాత అక్టోబర్ 28న సోలార్​ ఫ్లేర్స్​ విడుదలయ్యాయని, అవి రెండ్రోజుల తర్వాత భూమిని చేరుకున్నాయని తెలిపింది. ఈ ఫ్లేర్స్​కు ఎక్స్​1గా పేరు పెట్టారు. ఇక్కడ ఎక్స్ అంటే చాలా తీవ్రమైన ఫ్లేర్స్. ఎక్స్​ పక్కన ఉండే నంబర్.. ఆ ఫ్లేర్​ఎంత బలమైనదో వివరిస్తుంది. ఎక్స్​2 అంటే ఎక్స్​1 కన్నా రెండు రెట్లు తీవ్రమైనదని అర్థం. ఎక్స్​10 ఫ్లేర్స్​ను చాలా బలమైనవని చెబుతుంటారు.

సూర్యుడు నిద్ర లేస్తున్నడు

ప్రతి 11 ఏండ్లకోసారి కొత్త సోలార్​ సైకిల్ మొదలవుతుంది. ప్రతి సోలార్ ​సైకిల్​లో సూర్యుడు శాంత స్థితి నుంచి యాక్టివ్​గా మారతాడు. తర్వాత సూర్యుడిలో తుఫానులు మొదలవుతాయి. ఆ తర్వాత మళ్లీ శాంతిస్తాడు. ప్రస్తుతం సోలార్ సైకిల్​25 నడుస్తోంది. ఈ సైకిల్​లో ఎక్స్​ క్లాస్​కు చెందిన ఫ్లేర్​ విడుదలవడం ఇది రెండోసారి. అక్టోబర్​28న సూర్యుడిలో జరిగిన భారీ పేలుడు వల్ల బయటకు వచ్చిన ప్లాస్మా సునామీ లక్ష కిలోమీటర్ల ఎత్తులో సోలార్​ డిస్క్​ అంతా వ్యాపించింది.

ఏంటీ సోలార్​ ఫ్లేర్స్?

సోలార్​ఫ్లేర్స్​ అంటే శక్తివంతమైన రేడియేషన్. ఇవి స్పేస్​లో, భూమిపై ఉన్న టెక్నికల్​ వస్తువులను పని చేయకుండా చేయగలవు. సూర్యుడి నుంచి విడుదలయ్యే భయంకరమైన రేడియేషన్స్​ భూ వాతావరణం దాటి రాలేవు. కాబట్టి మనుషులకు ప్రమాదంలేదు. అయితే తీవ్రమైన రేడియేషన్ ​మాత్రం భూ వాతావరణాన్ని డిస్టర్బ్​ చేయగలదు. దీనివల్ల జీపీఎస్, ఇతర కమ్యూనికేషన్​ సిగ్నల్స్ పని చేయవని నాసా వివరించింది.